కార్తీకదీపం జూలై 8వ ఎపిసోడ్: కార్తీక్ సౌందర్య అమెరికా వెళ్లిందని చెప్పగానే మోనిత సాక్షి సంతకాల పెట్టడానికి తప్పించుకోడానికే వెళ్లిందా? అంటుంది. ఇక తను మౌనంగా ఉండే పని కాదని, ఎదోకటి చేయాలంటూ కార్తీక్ వెళ్లిపోమ్మని చెబుతూ కారు ఎక్కబోతుంటే కార్తీక్ ఆమె చెయి పట్టుకుని ఆపుతాడు. ఆ తర్వాత ఇక తాను చేయని తప్పుకు దోషిలా ఉండలేనని, తన ప్రేమయేయం లేకుండా జరిగింది తన తప్పుల జాబితాలో చేరదు అని గట్టిగా అరిచి చెబుతాడు కార్తీక్. అంతేగాక ‘నీ నాపై ప్రేమ, వదిలేస్తాననే భయం లాంటివి కనిపించడం లేదు. కావాల్సిన దాని కోసం ఎంత దూరమైన వెళ్తావన్న బెదిరింపు కనిపిస్తుంది’ అని అనడంతో మోనిత ఆశ్చర్యంగా చూస్తుంది.
అలాగే ‘స్నేహం కావాలంటే ముందు వరుసలో ఉంటా. అంతేగాని న్యాయం కావాలంటే అన్యాయానికి తలవంచను. మౌనంగా భరిస్తున్న కదా అని ఈ దోషాన్ని దీప, మా అమ్మకు అంటగట్టాలని చూస్తే అది సహించను. నా తప్పు లేకుండా జరిగిందానికి నేను నైతిక బాధ్యత వహించలేను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత షాక్ అవుతూ ప్రియమణి చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ బాబు అందరిలాంటి మగాడు కాదని, తన భార్య, తల్లి, కుటుంబం జోలికి వస్తే ఊరుకోడని ఆమె అన్న మాటలను తలచుకుని కంగారు పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ హిమ, శౌర్యలకు కొత్త బట్టలు కొనుక్కుని తీసుకువెళతాడు.
హిమ, శౌర్యను పిలిచి నాన్న డాడీ మీకు బట్టలు తెచ్చాడని అవి వేసుకోమ్మని చెబుతాడు. పిల్లలు అవి వేసుకోని రాగానే సెల్ఫీ తీసుకుందామని, దీపను కూడా పిలిచి తన భుజంపై చేయి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలతో ఈ ఫొటో మన సెల్‌ఫోన్ అన్నింటిలో ఆ ఫొటోనే వాల్‌పేపర్‌గా ఉండాలని చెబుతాడు. ఆ తర్వాత వారికి తెచ్చిన బట్టలను మీ స్నేహితులకు చూపించుకోమ్మని వెళ్లండని చెప్పి పిల్లలను బయటకు పింపిస్తాడు. ఆ తర్వాత దీపను కుర్చీలో కూర్చోబెట్టి ‘నా ప్రవర్తన నీకు కొత్తగా అనిపించోచ్చు దీప. కానీ ఇన్ని రోజులు నా తప్పు లేకుండానే నేను తప్పు చేసినవాడిలా తలదించుకుని ఉన్నాను. ఇక నుంచి అలా ఉండదు. ఈ 25 తేదీలోపు ఈ సమస్య తప్పకుండా పరిష్కారం దొరుకుంది. నన్ను నమ్ము దీప’ అంటూ ఆమె మీద ఒట్టు వేస్తాడు.
తరువాయి భాగం.. ఆదిత్య, దీప దగ్గరికి వచ్చి వదినా అన్నయ్య తప్పు చేశాడో లేదో అది నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటి నీకు చెబుతాను అంటూ దీప విజనగరం వెళ్లినప్పుడు కార్తీక్‌ను నిలదీసిన విషయం చెబుతాడు. అప్పుడు అన్నయ్య మరోసారి పరీక్షలు చేయించుకుంటానని తనతో అన్నది చెబుతాడు. అంతేగాక అన్నయ్య ల్యాబ్ కూడా వెళ్లాడు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అనగానే ఇందులో ఏమైనా ఉందేమో? ఇప్పుడు మనం ఏం చేద్దాం వదిన అనగానే, ఆదిత్యను ఆ ల్యాబ్‌కు వెళ్లి కనుక్కొమ్మంటుంది. అంతేగాక గోడ మీద మోనిత గీసిన గీతలను తడి గుడ్డతో చెరిపేస్తుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment