karthika Deepam: నిజం తెలుసుకున్న దీప, కోపంతో రగిలిపోతున్న మోనిత.. | Karthika Deepam Serial: Deepa Learns Truth From Bhagyalakshmi | Sakshi
Sakshi News home page

karthika Deepam: నిజం తెలుసుకున్న దీప, కోపంతో రగిలిపోతున్న మోనిత..

Published Thu, Jul 1 2021 4:02 PM | Last Updated on Thu, Jul 1 2021 6:05 PM

Karthika Deepam Serial: Deepa Learns Truth From Bhagyalakshmi - Sakshi

కార్తీకదీపం జూలై 1వ ఎపిసోడ్‌: కార్తీక్‌ మనసు బాగాలేక సౌందర్య దగ్గరికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోనిత తన దగ్గరికి వచ్చి వెళ్లిన విషయం సౌందర్య కార్తీక్‌తో చెబుతుంది. అంతేగాక ఆశీర్వదించండి అంటూ కాబోయే అత్త దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుని వెళ్లిందని కార్తీక్‌, మోనితకు రిజిస్టర్‌ మ్యారేజ్‌ అనే విషయం తనకు తెలిసిందని కార్తీక్‌ స్పష్టం చేస్తుంది. దీంతో కార్తీక్‌ షాక్‌ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలని ధీనంగా అడగ్గా ఏం చేసిన దీప, పిల్లలు, తల్లిదండ్రులైన తమకు, మోనితకు జావాబుదారిగా ఉండాలని అంటుంది సౌందర్య. దీంతో కార్తీక్‌ తనకే ఎందుకు ఇలా జరుగుతుందని అనగానే ‘నువ్వు చేసిన పాపమే’ అంటుంది సౌందర్య.

‘నా కోడలు ఏ తప్పు చేయకపోయిన పదేళ్లు అనుమానించి తనని బాధపెట్టావు, నీ కన్న బిడ్డే నిన్ను నాన్న అని పిలవడానికి సంకోచించేల చేశావు. ఇన్నాళ్ల దాని ఏడుపే నీకు శాపంగా మారింది’ ఈ విషయంలో ఏ విధమైన సాయం చేయలేను మై డియర్‌ స్టుపిడ్‌ సన్‌ అంటూ సౌందర్య కార్తీక్‌కు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే కార్తీక్‌కు తల తిరిగినట్టు అయ్యి అక్కడే కూలబడతాడు. మరోవైపు నిజం తెలుకున్న భాగ్యం దీపకు వచ్చి చెప్పేస్తుంది. దీపతో నీ తలరాత ఇలా ఉందేంటే, నీకు జీవితాంతం కష్టాలు తప్పవా? అంటూ మోనిత, కార్తీక్‌లకు 25వ తేదీన రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి అనే విషయం చెబుతుంది.

అది విని షాక్‌ అయిన దీప ఇదేలా సాధ్యమని, దీనికి డాక్టర్‌ బాబు ఒప్పుకున్నారా? అని అనుమానంగా ప్రశ్నించగా మోనిత రసీదు కూడా చూపించిందని ఏడుస్తూ చెబుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్‌ రోడ్డు పక్కన కారు ఆపి ‘ఈ పెళ్లి ఎలా ఆపాలి. దీపకు ఈ విషయం తెలియకముందే ఇది జరగాలి. అది మోనిత చెప్పినట్లు వింటేనే సాధ్యం అవుతుంది. కానీ మోనిత వినే పరిస్థితిలో లేదు. నా జీవితం ఇలా అయిపోయిందేంటీ? ఇంకా ఈ నరకం ఎంతకాలం’ అంటూ కార్తీక్‌ మదనపడుతుంటాడు. మరోవైపు నిజం తెలుసుకున్న దీప కలవరపడుతూ ఉంటుంది.

‘డాక్టర్‌ బాబుకు, మోనితకు పెళ్లి జరిగితే, నా పిల్లల భవిష్యత్తు, నా సంసారం, నేను ఏం కావాలి’ అని తలచుకుంటూ బాధపడిపోతుంది. ఈ నిజం తనతో ఎందుకు చెప్పలేదని, ఎవరో బయటి వాళ్లు వచ్చి చెబితే కానీ తెలియలేదు అని ఆలోచిస్తుంది. మోనిత అంటే చెప్పదు పెళ్లి ఆపేస్తానని, మరీ డాక్టర్‌ బాబు ఎందుకు చెప్పలేదు ఆపకూడదనా? అని అనుకుంటూ మరీ అత్తయ్యా ఎందుకు చెప్పలేదు, చెప్పాలకున్న చెప్పలేకపోయారా? ఎప్పుడు నాకు తల్లిలా తోడు ఉండే ఆమె ఈ సారి కొడుకు నిస్సహయత చూసి ఆమెలోని తల్లి మనుసు చలించి కొడుకు వైపు మళ్లిందా? అంటూ బాధపడుతూ ఉంటుంది. 

ఇదిలా ఉండగా మోనిత అద్దంలో చూసుకుంటూ ‘నా భార్య దీప గుడి కట్టాలి’ అని కార్తీక్‌ అన్న మాటాలను తలచుకుని రగిలిపోతుంది. అక్కడే ఉన్న పూల ప్లాస్క్‌తో అద్దాన్ని పగలగోడుతుంది. ఆ శబ్థం అక్కడికి వచ్చిన ప్రియమణి మోనిత సీరియస్‌గా ఉండటం చూసి భయపడుతుంది. ఏమైందని భయంతోనే అడుగుతుంది. ఇంతలో కాస్తా కూల్‌ అయిన మోనిత ఇంటి, వంటి పనితోనే కాదు అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్‌ట్రా పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదంతా క్లీన్‌ చేయి అని మెల్లిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక దీప పిల్లలకు భోజనం పెడుతుండా నాన్న వచ్చాక తింటామని చెబుతారు. దీంతో దీప నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీరు తినేయండి చెప్పిన వినకుండా లేట్‌ అయిన వేయిట్‌ చేస్తామంటూ మారాం చేస్తారు. ఏ పని మీద వెళ్లారో తెలియదు కదా ఎందుకు వేయిట్‌ చేయడం అనేలోపే కార్తీక్‌ వచ్చేస్తాడు. కార్తీక్‌ రాగానే తోందరగా ఫ్రెష్‌ అయి వస్తే కలిసి తిందాం డాడీ అని హిమ, శౌర్య అడగ్గా సరే అని వెళతాడు. దీంతో పిల్లలు నాన్న చల్ల నీళ్లతో స్నానం చేయడని చెప్పావు కదమ్మా మరేందుకు డాడీకి వేడి నీళ్లు పెట్టలేదని హిమ అడుగుతుంది. ఎప్పుడు వస్తారో తెలియదు కదా అందుకే పెట్టలేదని దీప అనడంతో మరీ ఇప్పుడు వెళ్లి పెట్టు అనగానే అది విన్న కార్తీక్‌ వద్దని సమాధానం ఇస్తాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement