
Intinti Gruhalakshmi జూన్ 28వ ఎపిసోడ్: శృతి కాలిని తన ఒడిలోకి తీసుకున్న ప్రేమ్ ఎంతో ఇష్టంగా ఆమెకు నెయిల్ పాలిష్ పెట్టాడు. ఇది చూసిన అంకితకు ఒళ్లు మండిపోయింది. వీళ్లిద్దరినీ ఇలాగే వదిలేస్తే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుంటుందని, శృతి ఈ ఇంటి కోడలవుతుందని, అది జరగడానికి అస్సలు వీల్లేదని మనసులో నిర్ణయించుకుంది. దీంతో వెంటనే ప్రేమ్ దగ్గరకు వెళ్లి శృతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని నిలదీసింది. అలాంటి ఉద్దేశ్యం లేకపోతే మాత్రం ఇలాంటి పనులు చేయకూడదని చెప్తూ మంచిదానిలా నటిస్తూ ప్రేమ్‌ను నమ్మించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక తులసి అత్తామామల పెళ్లై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నందు గ్రాండ్ ఫంక్షన్ జరిపించే ఏర్పాట్లలో ఉన్నాడు. ఈ వేడుకకు తులసి తల్లి వస్తుందన్న విషయం తెలిసిన లాస్య మరో కుట్ర పన్నింది. ఆమెను అడ్డుపెట్టుకుని ప్రళయం సృష్టించేందుకు రెడీ అయింది. మరో పక్క నందు ఈ వేడుకను సాంప్రదాయంగా జరిపించాల్సిన బాధ్యతను తులసికి అప్పగించాడు. అయితే దాన్ని సవ్యంగా జరగనివ్వకూడదని ఫిక్సైంది లాస్య.
ఈ వేడుక ద్వారా నందు కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలని కంకణం కట్టుకుంది. అనుకున్నట్లుగానే ఈ ఫంక్షన్‌కు హాజరైన తులసి తల్లిని అవమానించింది. మొగుడు పోయినదానివి, నీకేం తెలుస్తుంది ఇలాంటి వేడుకల విలువ అని నిందించింది. తన కళ్లముందే తల్లిని అవమానించడంతో తట్టుకోలేకపోయిన తులసి లాస్య చెంప చెళ్లుమనిపించింది. పెద్దావిడను అవమానించిన లాస్యను తిట్టాల్సింది పోయి ఆమె మీద చేయి చేసుకున్నందుకు నందు తులసి మీద కోప్పడ్డాడు.
దీంతో మరింత ఆవేశపడ్డ తులసి మానసికంగా మీకు నేనే విడాకులిస్తున్నానంటూ బాంబు పేల్చింది. భర్త స్థానం నుంచి మిమ్మల్ని చెరిపేస్తున్నానని తేల్చి చెప్పడంతో నందు షాకయ్యాడు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి? తులసి, నందుల మధ్య మరింత అగాధం ఏర్పడనుందా? అన్న విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: Rohit Shetty Love Story: డిన్నర్ డేట్స్, రొమాంటిక్ ఈవెనింగ్స్..
Comments
Please login to add a commentAdd a comment