![Intinti Gruhalakshmi June 7: Nandu Urges Help From Tulasi - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/7/nandu.gif.webp?itok=ZRW5WE-L)
తులసి ప్రయత్నాన్ని దెబ్బ కొట్టాలన్న లాస్య ప్లాన్ విజయవంతమైంది. కానీ తొలి ప్రయత్నంలోనే ఓటమిపాలైనందుకు తులసి దిగులు చెందలేదు. తను ఎగసిపడే ఉప్పెనలాంటిదాన్నంటూ మరింత ధైర్యంగా ముందడుగు వేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఎలాగైనా తులసి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని రగిలిపోయింది లాస్య. మరి నేటి (జూన్ 7) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి..
ఎంతో కష్టపడి గీసిన డ్రెస్ డిజైన్స్‌కు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోవడంతో తులసి తెగ టెన్షన్ పడింది. కానీ ఆ ఫైళ్లను మాయం చేసిన అనసూయ మాత్రం లోలోపలే సంతోషించింది. అయితే అనసూయ కుట్రను పసిగట్టిన శృతి తిరిగి ఆ ఫైళ్లను వెతికి తీసుకొచ్చింది. దీంతో అప్పటివరకు ఆందోళన చెందిన తులసి హమ్మయ్య అని ఓ నిట్టూర్పు వదిలి వాటిని తీసుకుని బయటకు వెళ్లిపోయింది.
ఇక తులసిని ఓడించేందుకు లాస్య డిజైనర్ స్టెల్లాను రంగంలోకి దింపింది. దీంతో కంపెనీ యాజమాన్యం తులసి, స్టెల్లా ఇద్దరి డిజైన్లు చూసి, చివరికి స్టెల్లాకు ప్రాజెక్టు అప్పజెప్పేందుకు మొగ్గు చూపింది. దీంతో లాస్య ఊహించినట్లుగానే తులసికి ప్రాజెక్టు దక్కకపోవడంతో ఆమె నిరాశగా వెనుదిరిగింది. ఇంతలో లాస్య తులసికి తారసడి ఆమెను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించింది. కానీ తనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదగడం తథ్యం అని లాస్య నోరు మూయించింది తులసి.
ఇంట్లో తనకు కాంట్రాక్ట్ రాలేదన్న విషయాన్ని చెప్పడంతో గయ్యాలి అత్త అనసూయ మళ్లీ తన నోటికి పని చెప్పింది. తులసికి ఏమీ చేత కాదంటూ నానా మాటలు అంది. ఇదిలా వుంటే రేపటి ఎపిసోడ్‌లో ఆర్థిక సాయం కోసం నందు తండ్రి కాళ్ల మీద పడ్డాడు. కానీ ఇప్పుడు తాను సాయం చేసే స్థితిలో లేనని చేతులెత్తేసిన అతడు వెళ్లి తులసిని అడగమని సలహా ఇచ్చాడు. దీంతో తనను ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించంటూ భార్యను ప్రాధేయపడ్డాడు. కానీ ఇందుకు తులసి ఏమాత్రం చలించనట్లు కనిపిస్తోంది. మరి ఆమె నందుకు సాయం చేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment