Intinti Gruhalakshmi May 28th Episode: నందు మీద పోలీస్‌ కంప్లైంట్‌?! - Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: నందు మీద పోలీస్‌ కంప్లైంట్‌?!

Published Fri, May 28 2021 1:59 PM | Last Updated on Fri, May 28 2021 2:33 PM

Intinti Gruhalakshmi May 28: Tulasi Brother Warns Nandu - Sakshi

ఇన్నాళ్లు సహనానికి మారుపేరుగా ఉన్న తులసి తన విశ్వరూపం చూపిస్తోంది. లాస్యను ఒక చీడపురుగులా చూస్తూ ఆమె పొగరు అణిచేలా చేస్తోంది. తులసి ఇలా రెచ్చిపోయి మాట్లాడటం, తనను ఒక పాచికపుల్లలా చూడటం సహించలేకపోయిన లాస్య ఎదురుదెబ్బ కొట్టాలని పగతో రగిలిపోతోంది. మరి నేటి(మే 28) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే దీన్ని చదివేయండి..

నందు మర్చిపోయిన డాక్యుమెంట్లను తీసుకువచ్చిన లాస్యకు చీవాట్లు పెట్టింది తులసి. లాస్యను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించిన అనసూయ నోరు మూయించాడు నందు తండ్రి. లాస్యది జనాల మధ్య బతకడానికి అర్హత లేని పుట్టుక అని నిందించాడు. సిగ్గు లేని జన్మలు అంటూ చీదరించుకోవడంతో లాస్య ఒళ్లు భగభగ మండిపోయింది. ఇక మీదట ఇంట్లో వాళ్లు తులసి చెప్పినట్లే నడుచుకోవాలని, లేదంటే లాస్యకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించాడు. ఏదైనా అవసరమైతే తన భర్త నందు రావాలి కానీ నువ్వు మాత్రం ఇంట్లోకి వస్తే మరింత హీనంగా చూస్తామని తులసి వార్నింగ్‌ ఇవ్వడంతో లాస్య మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది.

మరోవైపు తులసి, నందుతో సత్యనారాయణ వ్రతం చేయించేందుకు తులసి తల్లి ఆమె ఇంటికి బయలు దేరింది. ఇంతలో ఆటో పాడవటంతో నడుచుకుంటూ వస్తున్న ఆమెను నందు కారులో ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఇంటి లోపలికి మాత్రం అడుగు పెట్టకుండా అక్కడే బయట ఉండిపోయాడు. దీంతో అయోమయానికి లోనైన ఆమె అల్లుడు ఇంట్లోకి రావడం లేదేంటని కూతురిని ప్రశ్నించింది. అప్పుడే అక్కడికి వచ్చిన లాస్య మనింట్లోకి పద నందూ అంటూ మాట్లాడటంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది.

ఇక తన అక్కకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయాడు తులసి తమ్ముడు. నందు మీద పోలీసు కేసు పెడదామంటూ తులసి మీద ఒత్తిడి తెచ్చాడు. తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇష్టం లేని తులసి వద్దంటూ అతడిని ఆపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆవేశంతో ఊగిపోయిన అతడు నందు ఇంటికి వెళ్లి వార్నింగ్‌ ఇచ్చాడు. విడాకులు మంజూరవకముందు ఇలా వేరొకరితో ఉండటం చట్టరీత్యా నేరమని, ఇందుకుగానూ పోలీసు కేసు పెడతానని బెదిరించాడు. అప్పుడు వాళ్లే నిన్ను కాలర్‌ పట్టుకుని తులసక్క కాళ్ల మీద పడేస్తారని చెప్పాడు. మరి అతడు నిజంగానే నందు మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాడా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

చదవండి: NTR 31: ప్రశాంత్‌ నీల్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement