Intinti Gruhalakshmi June 3rd Episode: నందు డబ్బులు కొట్టేస్తోన్న లాస్య! - Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: నందు డబ్బులు కొట్టేస్తోన్న లాస్య!

Published Thu, Jun 3 2021 1:23 PM | Last Updated on Thu, Jun 3 2021 2:03 PM

Intinti Gruhalakshmi June 3: Lasya Cheats Nandu - Sakshi

లాస్య తన వంకర బుద్ధిని పోనిచ్చుకోలేదు. నందు మీద ప్రేమను ఒలకబోస్తూనే అతడికి వెన్నుపోటు పొడుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల వేతనాల కోసం ఉంచిన డబ్బును నందుకు తెలియకుండా అప్పనంగా వాడుకుంటోంది. పైగా ఆ డబ్బంతా ప్రాజెక్టుకు ఖర్చైపోయినట్లు నమ్మించింది. దీంతో నందు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాడు. మరోవైపు తులసి కొత్తగా ఏదైనా బిజినెస్‌ పెడదామని చూస్తోంది. మరి నేటి (జూన్‌ 3) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

తండ్రి ఆశీర్వాదం కోసం వచ్చిన దివ్య మీద నోరు పారేసుకుంటున్న లాస్యకు చుక్కెదురైంది. దివ్యకు క్లీస్‌ పీకుతున్న లాస్యను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాడు నందు. తర్వాత కూతురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడాడు. అప్పుడు దివ్య తను ఫస్ట్‌ డే కాలీజేకి వెళ్తున్నానంటూ తండ్రి కాళ్ల మీద పడిపోయింది. దీంతో ఆమెను చేరదీసిన నందు నువ్వు మంచి డాక్టర్‌గా ఎదగాలంటూ ఆశీర్వదించాడు.

మరోవైపు అంకిత తను గర్భం దాల్చిన విషయాన్ని భర్తకు చెప్పకుండా తప్పు చేస్తున్నానా? అని లోలోపలే అంతర్మథనం చెందసాగింది. అది చూసిన ఆమె తల్లి అబార్షన్‌ చేయించుకోవాల్సిందేనని పదేపదే ఆమె మీద ఒత్తిడి తెచ్చింది. గర్భవతినన్న విషయం నీ భర్తకు చెప్తే అతడు అబార్షన్‌ జరగనివ్వడని హెచ్చరించింది. దీంతో అంకిత పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.

ఇక నందుకు నీడలా ఉండే లాస్య పాములా విషం చిమ్ముతోంది. నందు కోసం ఏదైనా చేస్తాను అని ప్రేమ ఒలకబోసే ఆమె వెనక మాత్రం గోతులు తీస్తోంది. ఆఫీసులో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఉంచిన డబ్బును లాస్య లాగేసుకుంది. అయితే ఆ డబ్బు ప్రాజెక్టు వర్క్‌కు అయిపోయిందని నమ్మించి ఉద్యోగుల కోసం డబ్బు సర్దుమని వేరే ఉద్యోగితో చెప్పించింది. ఇది నిజమని నమ్మిన నందు నాలుగు రోజుల్లో వారికి వేతనాలు ఇచ్చేలా డబ్బు సర్దుతానని చెప్పాడు.

మరోవైపు తులసి కుట్టు మిషన్‌ వచ్చినవాళ్లను చేర్చుకుని కుటీర పరిశ్రమ పెడితే బాగుంటుందని భావించింది. ఇంకా తన భవిష్యత్తులో ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అని ప్లానింగ్‌ చేస్తుండగా ఆమె స్నేహితురాలు అంజలి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే తులసి అత్త అనసూయ అంజలి మీద నోరు పారేసుకుంది. ఆమె ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి వచ్చేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. తులసిలో వచ్చిన మార్పును చూసి అంజలి షాకైంది. మరి అంజలి ఏ పని మీద తులసి దగ్గరకు వచ్చింది? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: హీరో నిఖిల్‌ కారుకు రెండు చలాన్లు

దిశా మాజీ ప్రియుడి​ ఫొటోలు​.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్​!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement