
ఇంటింటి గృహలక్ష్మి జూన్ 21వ ఎపిసోడ్: అభి నేరుగా అంకితను తీసుకుని తులసి ఇంటికి వెళ్లినందుకు నందు ఆగ్రహించాడు. మీతో ఎంత ప్రేమగా ఉన్నా, ఎన్ని చేసినా ఇలా దూరం చేస్తున్నారని ఆవేశపడ్డాడు. అత్తిల్లు వదిలేసి వచ్చినట్లు తనతో ఒక మాటైనా చెప్పలేదేంటని నిలదీశాడు. లాస్యతో ఉన్నంత మాత్రాన పిల్లలను దూరం పెట్టనని స్పష్టం చేశాడు.
దీంతో అభి తండ్రి అలకను పోగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అంకిత మనం అందరితో సమానంగా కలిసిపోవాలని, కాబట్టి మామయ్య ఇంటికి వెళ్లొద్దామని అభికి నచ్చజెప్పింది.
మరోవైపు తనమూలంగా మళ్లీ ఇంట్లో గొడవలు రాకూడదని ఇక్కడి నుంచి వెళ్లిపోతానంది శృతి. అంకిత మనసులో తన మీదున్న ద్వేషం గొడవలకు దారి తీస్తుందని భయపడింది. కానీ తను ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, ఇంకోసారి అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వొద్దని తులసి మరీమరీ చెప్పడంతో శృతి కిమ్మనకుండా ఉండిపోయింది.
ఇక అభి, అంకిత.. నందు ఇంటికి వెళ్లి అతడికి సారీ చెప్పారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న లాస్య అంకిత దగ్గర అసలు కూపీ లాగింది. ఏ పని మీద తులసి ఇంటికొచ్చావని నిలదీసింది. దీంతో ఓపెన్ అయిపోయిన అంకిత.. అభిని తన వాళ్ల దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేద్దామనే ఇక్కడికి వచ్చానని చెప్పింది.
ఇది విని సంతోషపడిపోయిన లాస్య.. ఎలాంటి సాయం కావాలన్నా తనను నిరభ్యంతరంగా అడగొచ్చని తెలిపింది. అలా వీళ్లిద్దరూ తులసి మీద కుట్ర పన్నేందుకు చేతులు కలిపారు. మరి వీరి పన్నాగాన్ని తులసి పసిగడుతుందా? మున్ముందు తులసికి మరిన్ని చిక్కులు తప్పవా? అనేది రానున్న ఎపిసోడ్లలో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment