
కళ్ల ముందే కట్టుకున్నోడిని ఒకరు ఎగరేసుకుపోతుంటే ఏ భార్యా సహించదు. భూదేవి అంత సహనమున్న ఓ మహిళ కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకపోయింది. పైగా తన భర్త కావాలనుకుంటోంది ఓ జిత్తులమారి నక్కను అని తెలిసి అతడిని కాపాడాలనుకుంది. ఈ ప్రయత్నంలో భర్తకు, ఏకంగా ఇంటిల్లిపాదికే ఆమె శత్రువుగా మారింది.
అయినా సరే తన భర్తను తిరిగి తన సొంతం చేసుకునేందుకు పోరాడుతున్న తులసి కథే "ఇంటింటి గృహలక్ష్మి". మూడు వందలకు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌లో తులసి కష్టాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయినా బాధలు ఆమెను వదిలి పెట్టడం లేదు. మరి నేటి(మే 5న) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చదివేయండి..
నందు.. తులసికి దూరం కావాలన్న కసితో పక్కా ప్లాన్‌తో ఇల్లు వదిలి పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది లాస్య. దీనికంతటికీ కారణం తులసే అంటూ భార్య మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నందు. దీనికి తోడు లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి వీడియోను చూపించడంతో విడాకులు ఇచ్చి తీరుతానని శపథం చేశాడు. నాలుగు నెలల తర్వాత ఎవరి దారి వారిదేనని తేల్చి చెప్పాడు. అలా లాస్య ప్లాన్ అనుకున్నదానికంటే బాగా సక్సెస్ అయింది.
ఇక కళ్లెదుటే తల్లిదండ్రులు విడిపోవడం గురించి మాట్లాడటం జీర్ణించుకోలేకపోయిన తులసి కూతురు దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అమ్మ ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదని తండ్రిని నిలదీసింది. దీనికి సమాధానం చెప్పలేకపోయిన నందు నువ్వు చిన్నపిల్లవి అంటూ తను మారు మాట్లాడకుండా చేవాడు. ఎవరినైతే తన చెంతకు చేర్చుకోవాలని ప్రయత్నిస్తుందో అతడే విడాకులు తథ్యం అని చెప్పడంతో కూలబడిపోయింది తులసి. అన్నీ తలచుకుని ఒంటరిగా తనలో తానే కుమిలిపోయింది. తనను అలా చూసి చలించిపోయిన తులసి చిన్నకొడుకు మంచి రోజు వస్తుందంటూ తల్లికి ధైర్యం చెప్పాడు.
మరోవైపు దివ్యకు మెడిసిన్ సీటు వచ్చింది, కానీ అందులో జాయిన్ చేయడానికి నందు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది దివ్య. మరి సూసైడ్‌కు ప్రయత్నించిన దివ్యను తులసి కాపాడుకుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.
చదవండి: హిందీలోకి దృశ్యం 2 రీమేక్
Comments
Please login to add a commentAdd a comment