
నేటి(మే 20) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో భారీ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందునుంచీ ఊహించినట్లుగానే మాధవి విడాకులు ఉట్టి డ్రామా అని తేలింది. తులసి జీవితం బాగుచేసేందుకు, నందులో మార్పు కోసం చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. వీరి ప్లాన్‌ను లాస్య తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇదంతా తులసే దగ్గరుండి చేయించిందని చెప్తూ ఆమెను అన్యాయంగా ఇరికించింది. ఇది నిజమని నందును నమ్మించి అతడిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరి ఈరోజు ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..
సీక్రెట్‌గా ఓ చోట కలుసుకున్న మాధవి దంపతులు ఒక్కసారిగా పడీపడీ నవ్వుకున్నారు. వాళ్ల నటనను అందరూ నమ్మేశారని సంతోషించారు. ఏదైతేనేం, తులసి దంపతులు మళ్లీ కలిసిపోతారు అని సంబరపడ్డారు. దీనికి కారణమైన లాస్యను కూడా అన్నయ్య మనసులో లేకుండా చేయాలని రగిలిపోయింది మాధవి. అయితే వీరిని ఫాలో అయి వచ్చిన భాగ్య వీరి బండారం బయటపెట్టేందుకు వారి మాటలను సీక్రెట్‌గా వీడియో తీసింది. దీన్ని లాస్యకు చూపించడంతో ఆమె దానికి మరింత మసాలా కలిపి తులసిని ఓడించాలనుకుంది. వారి విడాకుల నాటకానికి రచన, దర్శకత్వం అన్నీ తులసే అని నమ్మిస్తే నందు తన భార్యను జీవితంలో నమ్మడని ఆలోచించింది.
అనుకున్నట్లుగానే నందును ఈజీగా నమ్మించింది లాస్య. ఈ విషయం నిజంగా తనకు తెలియదని, తనకు ఈ ప్లాన్‌తో ఎటువంటి సంబంధం లేదని తులసి మొత్తుకున్నా నందు ఆమె మాటలను చెవికెక్కించుకోలేదు. అందరూ కలిసి తనను మోసం చేశారని మండిపడ్డాడు. తులసితో చేతులు కలిపి తనను వెర్రివాడిని చేశారని ఆవేదన చెందాడు. ఇక జీవితంలో తులసిని నమ్మేది లేదని తేల్చి చెప్పాడు. లాస్యే తనకు సర్వస్వం అన్నట్లుగా మారిపోయాడు.
ఇకపై ఇంటి సర్వాధికారాలు లాస్యకు ఇద్దాం అనుకుంటున్నానని నందు చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఇంటి కోడలి స్థానం లాస్యదే అని తెగేసి చెప్పడంతో తులసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ బాధతో కుమిలిపోతే తనకు ఒరిగేదేమీ లేదనుకున్న తులసి రేపటి ఎపిసోడ్‌లో తిరగబడనున్నట్లు తెలుస్తోంది. మరి తులసి తన స్థానం కోసం పోరాడుతుందా? బాధతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment