Intinti Gruhalakshmi Today Episode June 11th: సంతకం పెట్టడానికి తులసి కండీషన్‌! - Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: సంతకం పెట్టడానికి తులసి కండీషన్‌!

Published Fri, Jun 11 2021 12:32 PM | Last Updated on Fri, Jun 11 2021 1:12 PM

Intinti Gruhalakshmi July 11: Nandu Requests Tulasi For Signature - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి జూన్‌ 11 ఎపిసోడ్‌: తులసితో సంతకం చేయిస్తానని ధీమాగా వెళ్లిన లాస్యకు మొండిచేయే ఎదురైంది. ఇంట్లో అడుగు పెడితేనే కాళ్లు విరగ్గొడతానన్నదాన్ని సంతకం ఎలా పెడతానని తులసి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన లాస్య.. నందు, నీ ఫ్యామిలీ మెంబర్స్‌ను దూరం పెట్టకూడదంటే సంతకం పెట్టాల్సిందే అని వార్నింగ్‌ ఇచ్చింది. ఇది విన్న తులసి, ఇదే మాట నందుతో అన్నావంటే చెప్పు తీసుకుని కొడతాడని తిట్టింది. దీంతో అవమానభారంతో వెనుదిరిగి వచ్చిన లాస్య నువ్వు వెళ్తేనే పనవుతుందంటూ నందును ఉసిగొల్పింది.

చిన్న సంతకం పెట్టడానికి ఎందుకింత పోజు కొడుతుందని నందు తులసి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆమె ఇంటి మెట్లు ఎక్కాడు. ఫైల్‌ మీద సంతకం చేయమని అడిగాడు. అలా సంతకం చేస్తే తను భార్య అని ఒప్పుకున్నట్లే కదా అని తులసి లాజిక్‌లు మాట్లాడింది. దీంతో అత్త అనసూయ తులసి మీద చిర్రుబుర్రులాడబోయింది. ఆమె మాటలనుమధ్యలోనే అడ్డుకున్న తులసి.. కొడుకు జీవితం బంగారంలా, కోడలు జీవితం బురదపాలవ్వాలనుకునే నీకు మాట్లాడే అర్హత లేదని ఆమె నోరు మూయించింది.

మరోవైపు అభికి అంకిత గర్భవతన్న విషయం తెలిసింది. ఈ శుభవార్తను అతడు తల్లితో పంచుకున్నాడు. నాన్నను వెంటపెట్టుకుని వచ్చేయమని కోరాడు. దీంతో తులసి తను సంతకం పెట్టాలంటే తనవెంట అభి ఇంటికి రావాలని నందుకు కండీషన్‌ పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి నిజంగానే తులసి ఈ కండీషన్‌ పెడుతుందా? లేదా అసలు సంతకమే పెట్టదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!

చదవండి: ఆ సీక్వెల్‌లో నేను, నా కొడుకు కలిసి నటిస్తాం: బాలయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement