Intinti Gruhalakshmi Today Episode June 1st: అంకితను అబార్షన్‌ చేయించుకోమన్న తల్లి! - Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: అంకితను అబార్షన్‌ చేయించుకోమన్న తల్లి!

Published Tue, Jun 1 2021 3:19 PM | Last Updated on Thu, Apr 14 2022 12:24 PM

Intinti Gruhalakshmi June 1: Is Ankita To Abort Her Pregnancy - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో తులసి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిస్తుంటే నందు మాత్రం తన ప్రాజెక్ట్‌ ఇంకా పూర్తి చేయలేదన్న టెన్షన్‌లో మగ్గిపోతున్నాడు. అటు లాస్య మాత్రం తులసి ధైర్యాన్ని కుంగదీసేందుకు, ఆమెను ఒంటరిని చేసి చిత్తు చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. మరి నేటి (జూన్‌ 1) నాటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

లాస్య ఇంటికి వెళ్లొచ్చినందుకు అనసూయకు ఆమె భర్త చీవాట్లు పెట్టాడు. మనం నందు దగ్గరకు వెళ్లకూడదని, అతడికి బుద్ధి రావాలని, బంధాల విలువ తెలిసి రావాలని తెలిపాడు. అయితే కొడుకును చూసి రావడం తప్పేం కాదని తులసి అత్తకు మద్దతిస్తూనే అక్కడ తన వ్యక్తిగత విషయాలు చర్చించకూడదు అని వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం.

మరోవైపు అంకిత గర్భం దాల్చిన సంతోషకర విషయాన్ని తల్లితో పంచుకుంది. అయితే ఆమె ఊహించినదానికి భిన్నంగా అంకిత తల్లి పెద్ద నిట్టూర్పు విడిచింది. అదేమీ శుభవార్త కాదంటూ, పైగా భవిష్యత్తు అడ్డు అవుతుందని చెప్తూ అబార్షన్‌ చేయించుకోమని ఉచిత సలహా ఇచ్చింది. వీలైతే ఈ విషయాన్ని అభికి చెప్పకుండా దాచమని సూచించింది. ఎందుకంటే అతడు కుదరదంటే పెద్ద రాద్ధాంతం అవుతుందని అభిప్రాయపడింది. అయినా ఇప్పుడు నీకు పిల్లలు కాదు, భవిష్యత్తు ముఖ్యమని నొక్కి చెప్పింది. దీంతో అంకిత ఇప్పుడేం చేయాలా? అని ఆలోచనలో పడింది.

చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ప్రేమ్‌ వచ్చీరాగానే లాస్య ఇంటికి వెళ్లి నందు మీద చిర్రుబుర్రులాడాడు. మా అమ్మను వదిలేసి లాస్యతో బయటకు వచ్చేసినప్పుడే ఆయన పతనం ప్రారంభమైందని చెప్పాడు. మా అమ్మ ఒక్కో మెట్టు ఎదగడం, మీరు రెండు మెట్లు దిగడం ఏకకాలంలో జరుగుతుందని, మీరు ఏదో ఒక రోజు మా అమ్మ కాళ్ల మీద పడతారని జోస్యం పలికాడు. దీంతో నందు, లాస్య భగభగమండిపోయారు. తులసి కావాలనే ప్రేమ్‌ను మిమ్మల్ని నిందించడానికి పంపిందని లాస్య చెప్పడంతో నందు మరింత ఆగ్రహం చెందాడు. 

ఇదిలావుంటే అంకిత తను గర్భవతినన్న విషయాన్ని భర్తకు చెప్తుందా? ఒకవేళ చెప్పిన తర్వాత అబార్షన్‌కు అతడిని ఒప్పిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: భార్య ఫిర్యాదుతో ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్‌

ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement