
చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని సీనియర్ నటుడు, సౌత్ ఇండియన్ డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధార చెప్పారు. ఈయనపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కాగా ఈ యూనియన్‌కు గత 15 తేదీన ఎన్నికలు జరిగాయి.
నటుడు రాధారవి మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి నామినేషన్‌ను వేసింది. అయితే ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. అది చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. దీంతో రాధారవి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బింగ్ కళాకారుల యూనియన్ సంక్షేమానికి పలు పథకాలును రచించినట్లు రాధారవి తెలిపారు. కాగా చిన్మయి వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆమె తమపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రచార ప్రియురాలిగా మారినట్లు విమర్శించారు. ఇంకా తమపై విమర్శలు చేస్తే చిన్మయిపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment