ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా నుంచి వీడియో సాంగ్ లాంచ్ | Prabhutva Junior Kalasala Movie Release Now Song | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా నుంచి వీడియో సాంగ్ లాంచ్

Published Thu, Jan 4 2024 7:02 PM | Last Updated on Fri, Jan 5 2024 1:04 PM

Prabhutva Junior Kalasala Movie Release Now Song - Sakshi

ప్రణవ్, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో కొవ్వూరి అరుణ గారి సమర్పణ లో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండో సాంగ్ చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్ పాటని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడమే కానీ ఫస్ట్ టైం మూవీకి సంబంధించిన వీడియో సాంగ్ మూవీ రిలీజ్‌కు ముందే విడుదల చేయడం చాలా కొత్తగా ప్లాన్ చేశారు టీం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విచ్చేశారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు  మాట్లాడుతూ : 2000's బ్యాక్ డ్రాప్ నేటివిటికి తగినట్టుగా సినిమాను తీసుకొచ్చారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మంచి సినిమా, మంచి కంటెంట్‌కు మీడియా సపోర్ట్‌తో పాటు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నారు.

దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ : ఈ కాలంలో ప్రైవేట్ కాలేజీలు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మాట చాలా తక్కువ వినిపిస్తోంది. 2000's బ్యాక్ డ్రాప్‌లో పుంగనూరు గ్రామంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూస్తున్నారు కానీ మేము ఒక మంచి సినిమా మంచి బ్యానర్ అండ్ డీసెంట్ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను ప్రేక్షకులు, మీడియా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ : శ్రీనాథ్ చెప్పిన కథ బాగా నచ్చి తనని నమ్మి కథను నమ్మి సినిమా దర్శకుడు అని పేరే కానీ అన్ని దగ్గరుండి చూసుకుని మంచి కాన్సెప్ట్ తో కొత్త కథగా ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. సినిమా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో ప్రణవ్ మాట్లాడుతూ : డైరెక్టర్ శ్రీనాథ్ గారు నన్ను నమ్మి ఈ కథకు నన్ను సెలెక్ట్ చేశారు సంతోషంగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఒక యాక్టర్ గా ఎదగాలనుకున్న నన్ను హీరోను చేశారు. కథ చాలా కొత్తగా ఉంటుంది రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లేలా రియలిస్టిక్ గా ఈ సినిమాను చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిన్మయి  పాడిన ఈ పాట కూడా మంచి సక్సెస్ అవుతుంది. సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నారు.

హీరోయిన్ షజ్ఞ శ్రీ మాట్లాడుతూ : ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ శ్రీనాథ్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. విజువల్స్ చాలా బాగా వచ్చాయి డైరెక్టర్ టేకింగ్‌తో పాటు ప్రొడ్యూసర్  ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్‌ను అలాగే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మీడియా  ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement