
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు.
(ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి)
'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్‌లో తెలిపారు. రాహుల్ పోస్ట్‌పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు.
(ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!)