మే 6న గాయని చిన్మయి వివాహం | Chinmayi , Rahul Ravidran's Marriage On May 6 at chennai | Sakshi
Sakshi News home page

మే 6న గాయని చిన్మయి వివాహం

Published Thu, Apr 24 2014 8:58 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

మే 6న గాయని చిన్మయి వివాహం - Sakshi

మే 6న గాయని చిన్మయి వివాహం

అమె మాటలో ఓ విధమైన మత్తు ఉంది. మరీ చెప్పాలంటే గమ్మత్తు ఉంది. ఆమె ఏ హీరోయిన్కి అయిన డబ్బింగ్ చెప్పిందంటే .. ఆ హీరోయిన్ వెండి తెర మీద వెలిగిపోవాల్సిందే. ఆ డబ్బింగ్ కమ్ సింగర్ చిన్మయి శ్రీపాద. చిన్మయి వివాహం మే ఆరో తేదీన చెన్నైలో జరగనుంది. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషాల్లో వెయ్యి పాటలను పాడిన చిన్మయి, అందాల రాక్షసి ఫేం నటుడు రాహుల్ రవీంద్ర గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు.

 

వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించి.. వివాహ ముహూర్తం నిశ్చయించారు. మే నెల 6వ తేదీన చెన్నైలోని నక్షత్ర హోటల్‌లో రాహుల్ రవీంద్ర, చిన్మయిల వివాహం వేడుకగా జరగనుంది. సరసర సాలై కాట్రు, సహానా సారల్ తూవుదో, కిళి మాంజారో వంటి పాటల ద్వారా ప్రాచుర్యం పొందిన గాయని చిన్మయి. ప్రముఖ హీరోయిన్ సమంతాకు తొలి చిత్రం ఏమాయ చేసావే నుంచి అన్ని చిత్రాలకు చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. 



తమ పెళ్లికి విచ్చేసే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆ కొత్త జంట ఓ వినూత్నమైన విజ్ఞప్తి చేశారు. తమకు ఎటువంటి బహుమతులు, బోకేలు, ఇతరత్రా కోసం నగదును నిరూపయోగంగా ఖర్చు చేయవద్దని కోరారు. అలా ఖర్చు చేసే నగదును లడక్లోని 17,000 ft Foundation కు డోనేట్ చేయాలి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement