భారతం నుంచి బాహుబలి దాకా... | Drushti Movie Trailer released | Sakshi
Sakshi News home page

భారతం నుంచి బాహుబలి దాకా...

Published Sat, Jan 20 2018 5:45 PM | Last Updated on Sat, Jan 20 2018 5:50 PM

Drushti Movie Trailer released - Sakshi

భారతం నుంచి బాహుబలి దాకా అన్ని అమ్మాయిల గురించే జరిగాయి అన్న డైలాగ్‌తో ‘దృష్టి’ సినిమా ట్రైలర్‌  విడుదలైంది. అందాల రాక్షసి ఫేం రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా, పావని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌తోనే ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఫోటోగ‍్రఫీ అంటే ఇష్టముండే వ్యక్తి పాత్రలో రాహుల్‌ నటించాడు. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు సత్యప్రకాశ్‌, కమెడియన్‌గా వెన్నెలకిశోర్‌ పాత్రలకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది . దర్శకుడు రామ్‌ అబ్బరాజు ఈ సినిమాను థ్రిల్లర్‌, యాక్షన్‌, కామెడీగా  మలిచారు . సంగీతం : నరేశ్‌ కుమారన్‌, ఎడిటర్‌​ : ఎస్‌ బి ఉద్దవ్‌, ఫోటోగ్రఫి : పి.బాలరెడ్డి, నిర్మాత : మోహన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement