
గత వేసవిలో ఇద్దరం స్కాట్లాండ్ వెళ్లాం
‘అందాల రాక్షసి’ చిత్రంతో యువతకు కనెక్ట్ అయిన హీరో రాహుల్ రవీంద్రన్. క్యూట్‌గా యూత్ హృదయాలను దోచుకున్న యువ నటుడు. తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో చేసిన అల్లరిని, గడిపిన క్షణాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘నేను పుట్టింది చెన్నైలో. స్కూలింగ్, కాలేజీ కూడా అక్కడే చేశాను. వేసవి సెలవులను ఒక సంవత్సరం అమ్మ తరపు కజిన్స్ ఇంట్లో, మరో సంవత్సరం నాన్న తరపున కజిన్స్ ఇంటికి వెళ్లి సరదాగా గడిపేవాడిని. మా పెద్దమ్మ జంషడ్‌పూర్‌లో ఉండేది. అక్కడి ప్రదేశాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. పెదనాన్న టాటా స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేసేవారు. పెద్ద బంగ్లా, లైబ్రరీ, ఆటస్థలం ఉండేవి అక్కడ కజిన్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాడిని. పుస్తకాల్లో ఉన్న కామిక్ క్యారెక్టర్స్‌ని నిజ జీవితంలో ఉన్న అనుకొని వాటిని అనుకరిస్తూ ఉండేవాడిని.
నాకు ఇంగ్లిష్, హిస్టరీ పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. వేసవి సెలవుల్లోనే తదుపరి సంవత్సర పుస్తకాలను ముందుగానే అందించేవారు. నేను మాత్రం హిస్టరీ, ఇంగ్లిష్ పుస్తకాలను పూర్తిగా చదివేసేవాడిని. అందుకనేమో కొన్ని సార్లు ఆ రెండు సబ్జెక్ట్సే పాసయ్యేవాడిని. ఎనిమిదవ తరగతి నుంచి చెన్నైలో ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగాక ఎండను కూడా లెక్కచేయకుండా క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాట్ ఆటలు ఆడేవాళ్లం.
పేరెంట్స్, రిలేటివ్స్ ఎంత తిడితే అంత ఎక్కువసేవు ఆటలతో గడిపేవాళ్లం. సినిమాల్లోకి వచ్చాక నేను చిన్నతనంలో చేసిన పనుల వల్ల కావచ్చు వేసవి రోజుల్లోనే ఎక్కువ షూటింగ్స్ వచ్చాయి. మండుటెండల్లో సినిమా షూటింగ్స్‌తో వేసవి రోజులు గడిచిపోయాయి. పెళ్లయ్యాక సింగర్ చిన్మయితో గత వేసవి సెలవులకు స్కాట్లాండ్ వెళ్లాం. ఈ సంవత్సరం వియాత్నాం గానీ కంబోడియా వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ వేసవిలో షూటింగ్స్ బాగానే ఉన్నా కొద్దిగా గ్యాప్ ఇస్తున్నా’.. అని నవ్వుతూ చెప్పారు.