హీరో రాహుల్ దర్శకత్వంలో సుశాంత్
‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’, ‘గాలిపటం’ తదితర చిత్రాల్లో హీరోగా, మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారనున్నారు. సుశాంత్ హీరోగా సిరిని సినీ కార్పొరేషన్ నిర్మాణంలో ఈ సిన్మా తెరకెక్కనుందని రాహుల్ తెలిపారు. ‘‘చిన్ననాటి కలలను నిజం చేసుకునేందుకు దర్శకత్వంలో తొలి అడుగులు వేయబోతున్నాను.
అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘లవ్లీ స్క్రిప్ట్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నా’’ అని సుశాంత్ ట్వీటారు.