వెరైటీ ప్రేమకథ | Ramasakkanodu Shoot Launched | Sakshi
Sakshi News home page

వెరైటీ ప్రేమకథ

Aug 19 2016 11:58 PM | Updated on Sep 4 2017 9:58 AM

వెరైటీ ప్రేమకథ

వెరైటీ ప్రేమకథ

రాహుల్ రవీంద్రన్ హీరోగా ‘రామసక్కనోడు’ అనే ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. నిత్యాశెట్టి, తరుణిక కథానాయికలు.

 రాహుల్ రవీంద్రన్ హీరోగా ‘రామసక్కనోడు’ అనే ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. నిత్యాశెట్టి, తరుణిక కథానాయికలు. రాథోడ్ ఎం.దర్శకత్వంలో అమ్మానాన్న ఫిలింస్ పతాకంపై మణీంద్రన్ ఎం. నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ పాత్రికేయులు వినాయకరావు కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఆర్నెల్లు స్క్రిప్ట్ వర్క్ చేశాం.

ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు వినోదంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను గతంలో చేసిన చిత్రాలకంటే ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. కథ విని వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ప్రశ్నాత్ తాత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement