tarunika
-
లవ్ థ్రిల్లర్
కల్వకోట సాయితేజ, తరుణిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘శివన్’. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.ఆర్. సినీ ఎంటర్టైన్మెంట్పై వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివన్ మాట్లాడుతూ– ‘‘లవ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా చిత్రం టీజర్లో కొంత బోల్డ్ కంటెంట్ ఉంది. అయితే ట్రైలర్ అలా లేదు, కొత్తగా కట్ చేశాం. నిర్మాత డి.ఎస్. రావుగారి పాత్ర ఓ హైలెట్. సాయితేజ మంచి హీరోగా ఎదుగుతాడు. తరుణిక బాగా నటించింది. మీరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
వెరైటీ ప్రేమకథ
రాహుల్ రవీంద్రన్ హీరోగా ‘రామసక్కనోడు’ అనే ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. నిత్యాశెట్టి, తరుణిక కథానాయికలు. రాథోడ్ ఎం.దర్శకత్వంలో అమ్మానాన్న ఫిలింస్ పతాకంపై మణీంద్రన్ ఎం. నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ పాత్రికేయులు వినాయకరావు కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఆర్నెల్లు స్క్రిప్ట్ వర్క్ చేశాం. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు వినోదంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను గతంలో చేసిన చిత్రాలకంటే ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. కథ విని వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ప్రశ్నాత్ తాత.