ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే! | Rahul Ravindran Posts Nagarjuna Look In Manmadhudu 2 Movie | Sakshi
Sakshi News home page

ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే!

Published Thu, Apr 18 2019 6:29 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Rahul Ravindran Posts Nagarjuna Look In Manmadhudu 2 Movie - Sakshi

బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంటూ.. ఇక్కడ మల్టీస్టారర్‌లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు కింగ్‌ నాగార్జున. ఇటీవలె దేవదాస్‌తో పలకరించిన నాగ్‌.. అటు బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు.  నాగ్‌ ప్రస్తుతం ‘మన్మథుడు2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

‘చి.ల.సౌ’తో డైరెక్టర్‌గా మంచి సక్సెస్‌ అందుకున్న రాహుల్‌ రవీంద్రన్‌.. మన్మథుడు2ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్‌ జరుపుకుంటొంది చిత్ర యూనిట్‌. నాగ్‌కు సంబంధించిన ఓ షాట్‌ను రాహుల్‌ రవీంద్రన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆయన ట్విటర్‌లో నాగ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. ఫిట్‌నెస్‌లో ఈ మనిషి.. అంటూ దండం పెడుతూ​.. కింగ్‌ ఫ్యాన్స్‌.. ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే అని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో సమంత ఓ ముఖ్యపాత్రను పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, నాజర్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement