అంజలి మరో యాంగిల్‌ | Chi La Sow Fame Ruhani Sharma Photoshoot | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 14 2018 10:34 AM | Last Updated on Tue, Aug 14 2018 11:32 AM

Chi La Sow Fame Ruhani Sharma Photoshoot - Sakshi

క్లాస్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘చి ల సౌ’ మంచి టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాతో రుహాని శర్మ హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. అంజలి పాత్రలో తొలి సినిమాతోనే నటిగా ఫుల్‌ మార్క్స్‌ సాధించిన ఈ బ్యూటీ ఆడియన్స్‌ను హోమ్లీ లుక్‌లో ఫిదా చేశారు.

సినిమా అంతా ఒకే రోజులో జరిగే కథ కావటంతో లుక్‌ పరంగా రుహానికి వేరియేషన్స్‌ చూపించే అవకాశం దక్కలేదు. క్యారెక్టర్‌ పరంగా మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా చుడిదార్‌లో పద్దతిగా కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్‌ నుంచి బయటపడేందుకు రుహాని శర్మ ఓ హాట్‌ ఫొటో షూట్ చేశారు. తనలో గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఉందని హింట్‌ ఇచ్చారు. మరీ ఈ ఫొటోషూట్‌తో రుహాని ఇమేజ్‌ మారుతుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement