హౌరా బ్రిడ్జ్‌ వచ్చేస్తోంది.... | Rahul Ravindran Howrah Bridge Movie update | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 2 2018 4:21 PM | Last Updated on Tue, Jan 2 2018 4:45 PM

Rahul Ravindran Howrah Bridge Movie  update - Sakshi

హౌరా బ్రిడ్జ్‌ రావడమేంటీ...? మనమే దాని దగ్గరకు వెళ్లి చూడాలి కదా అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదండీ. అందాల రాక్షసి ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ నటిస్తున్న ‘హౌరాబ్రిడ్జ్‌’ సినిమా త్వరలో రిలీజ్‌ కాబోతోంది. హౌరాబ్రిడ్జ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరు ప్రేమికులను ఈ హౌరాబ్రిడ్జ్‌ కలుపుతుందేమో? అందుకే ఈ సినిమాకు ‘కనెక్టింగ్‌ లవ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు.  ఈ సినిమాలో రాహుల్ సరసన చాందిని, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

రాహుల్‌ ప్రస్తుతం దృష్టి, శోభన్‌బాబు, హౌరాబ్రిడ్జ్‌ సినిమాలలో నటుడిగా బిజీగా ఉన్నారు. హౌరాబ్రిడ్జ్‌ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు రేవన్‌ యాదు(బూచమ్మ బూచోడు ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.త్వరలోనే  చిత్రయూనిట్‌  సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనుంది.సుశాంత్‌ హీరోగా  రాహుల్‌ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘చి ల సౌ’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement