Howrah Bridge
-
ట్రిప్ గుర్తుండిపోయేలా... హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే స్టెప్పులు
పశ్చిమబెంగాల్: ఈ మధ్య స్టార్ డమ్ కోసం యూట్యూబర్‌గా ఫేమస్ అవ్వడానికో చాలా మంది రద్దీగా ఉండే హైవేల పై రకరకాలుగా డ్యాన్స్ చేసి ట్రాఫిక్ పోలీసుల ఆగ్రహానికి గురైన సంఘటనలు గురించి చాలానే విన్నాం. అలాగే మరికొంతమంది తమ విహారయాత్ర మధుర స్మృతిలా గుర్తుండేపోయేలా విన్నూతనంగా పేరుగాంచిన బ్రిడ్జిలపై డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్యర్యపరుస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఎవరు చేశారు అని ఆత్రుతుగా ఉన్నారా. (చదవండి: అది బైక్ ? విమానమా !) వివరాల్లోకెళ్లితే....కోల్‌కతాకి ఐకానిక్‌గా పేరుగాంచిన హౌరా బ్రిడ్జ్ పై ఓ అమ్మాయి, అబ్బాయి శ్రీలంక గాయని యోహాని దిలోకా డి సిల్వా పాడిన సింహళ పాటకు నృత్యం చేశారు. అంతేకాదు ఈ పాట శ్రీలంకగాయనీ యోహానికి అంతర్జాతీయ గుర్తింపునున తెచ్చింది. ఈ మేరకు ఆమె ఈ పాటను ఈ ఏడాది మేలో యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కాలేకపోయినప్పటికీ ఆ పాటకు నృత్యం చేసిన ఈ అబ్బాయి అమ్మాయిల వల్ల మాత్రం చాలామందికి చేరువైందని చెప్పక తప్పదు. (చదవండి: ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ?) -
నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి
కోల్‌కతా : నోబెల్ బహుమతి కావాలి అంటూ ఓ మహిళ హౌరా బ్రిడ్జి ఎక్కి హల్చల్ చేసింది. ప్రముఖ ఆర్థికవేత్త అమర్థ్యసేన్ నా నోబెల్ బహుమతిని దొంగిలించాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటూ వాపోయింది. నోబెల్ ప్రైజ్ తిరిగి ఇచ్చేవరకు కదలనని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆమెను కిందకి దించడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు. మతిస్థిమితం లేని మధ్య వయస్కురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు డొల్లి ఘోష్ అని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఆదివారం 6 గంటల ప్రాంతంలో ఆమె హౌరా బ్రిడ్జిపై ఎక్కిందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకి దింపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నోబెల్ ప్రైజ్ వెతికి తెచ్చిస్తామని మాట ఇవ్వడంతో సదరు మహిళ కిందకు దిగేందుకు ఇప్పుకోవడంతో విషయం సద్దుమణిగింది. (కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. ) -
కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ
-
హౌరా బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హౌరా బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. -
లవ్లీ జర్నీ
‘‘రేవన్ యాదు నా కోసం మంచి పాత్రను తీర్చిదిద్దారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా బాగా వచ్చింది. అందుకే ప్రమోషన్స్ విషయంలో రాజీ పడటం లేదు. చాందిని, మనాలి చక్కగా నటించారు. శేఖర్ ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా లవ్లీ జర్నీ’’ అని హీరో రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆయన హీరోగా చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ఈఎమ్వీఈ స్టూడియోస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా నా రెండో చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. సినిమా చాలా బాగా తీశాం’’ అన్నారు రేవన్ యాదు. హీరో నిఖిల్, ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, చాందినీ చౌదరి, శేఖర్ చంద్ర, హీరోలు నారా రోహిత్, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధాల వారధి
రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. ఇ.ఎమ్.వి.ఇ స్టూడియోస్ ప్రై లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ‘‘ఈ సినిమాకు ‘హౌరా బ్రిడ్జ్’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఓ రీజన్ ఉంది. హ్యూమన్ రిలేషన్స్ ఒక బ్రిడ్జ్ అయితే ఈ సినిమాలో మరో బ్రిడ్జ్ ఏంటి అనేది సస్పెన్స్. చాందిని చౌదరి, మనాలీ బాగా యాక్ట్ చేశారు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘రాహుల్ అద్భుతంగా నటించారు. మంచి ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అజయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: విజయ్ మిశ్రా. -
హౌరా బ్రిడ్జ్ వచ్చేస్తోంది....
హౌరా బ్రిడ్జ్ రావడమేంటీ...? మనమే దాని దగ్గరకు వెళ్లి చూడాలి కదా అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదండీ. అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న ‘హౌరాబ్రిడ్జ్’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. హౌరాబ్రిడ్జ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరు ప్రేమికులను ఈ హౌరాబ్రిడ్జ్ కలుపుతుందేమో? అందుకే ఈ సినిమాకు ‘కనెక్టింగ్ లవ్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ సినిమాలో రాహుల్ సరసన చాందిని, మనాలీ రాథోడ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. రాహుల్ ప్రస్తుతం దృష్టి, శోభన్‌బాబు, హౌరాబ్రిడ్జ్ సినిమాలలో నటుడిగా బిజీగా ఉన్నారు. హౌరాబ్రిడ్జ్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు రేవన్ యాదు(బూచమ్మ బూచోడు ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.త్వరలోనే చిత్రయూనిట్ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనుంది.సుశాంత్ హీరోగా రాహుల్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘చి ల సౌ’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ అంతా చుట్టేయాలి...
షార్ట్ ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి.. ‘కేటుగాడు’తో తెరంగ్రేటం చేసి.. ‘శమంతకమణి’లా మెరిసిన ‘కుందనపు బొమ్మ’లాంటి పదహారణాల తెలుగమ్మాయి చాందినీ చౌదరి. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్గా నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆమె నటించిన మరో చిత్రం ‘హౌరాబ్రిడ్జి’విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చాందిని సిటీతో అనుబంధం, తన నటనా ప్రస్థానాన్ని వివరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... మాది వైజాగ్. బెంగళూర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. బీటెక్‌లో ఉండగా స్నేహితుల కోరిక మేరకు షార్ట్ఫిల్మ్స్లో నటించాను. నేను, హీరో రాజ్‌తరుణ్ కలిసి 2011లో నటించిన ‘బ్లైండ్ డేట్’ షార్ట్ఫిలిమ్కి మంచి స్పందన వచ్చింది. తర్వాత లక్కీ, నౌదోగ్యారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు మరింత చేరువయ్యాను. 2014లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నేను, రవి నటించిన ‘మధురం’ షార్ట్ ఫిలిమ్ యూట్యూబ్‌లో సూపర్‌హిట్ అయింది. వెండితెరపై అవకాశం.. ‘మధురం’ సోషల్‌లో వైరల్ అవడంతో వెండితెరపై అవకాశాలొచ్చాయి. అయితే అప్పుడు చదువు కోసం సినిమాలు వదులుకున్నాను. 2015లో కేటుగాడు చిత్రంలో హీరోయిన్గా నటించాను. అనంతరం కుందనపు బొమ్మ, శమంతకమణి చిత్రాల్లో చేశాను. హీరో రాహుల్ రవీంద్రన్తో కలిసి నటించిన ‘హౌరాబ్రిడ్జి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌తో కలిసి నటించిన ‘మను’ చిత్రం త్వరలో విడుదల కానుంది. సిటీ చుట్టేయాలి... హైదరాబాద్ అంతా చుట్టేయాలని ఉంది. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో కుదరడం లేదు. ఇక్కడ ఎక్కువ సమయం గడపాలనుకున్నా వీలు కావడం లేదు. దేశంలోనే ఇది డిఫరెంట్, ఫ్రీడమ్ అండ్ ఫ్రెండ్లీ సిటీ. సిటీలో ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని కొన్ని రెస్టారెంట్స్‌లో దొరికే ‘జపనీస్ సూశి’ వంటకాన్ని ఎంతో ఇష్టంగా లాగించేస్తా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ వంటకాన్ని రుచి చూస్తాను. షాపింగ్ చేయడమంటే ఇష్టం. స్పోర్ట్స్ అంటే ఇష్టం.. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లో అధికంగా పాల్గొనేదాన్ని. త్రోబాల్, ఖోఖో, లాంగ్‌జంప్‌లలో రాష్ట్రస్థాయిలో పాల్గొన్నాను. పెయింటిం కూడా వేస్తాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్లో నా చిత్రాలు ప్రదర్శించాను. ఫేస్బుక్లో 5లక్షల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 2.3 లక్షల మంది అభిమానులు ఉన్నారు. వారందరి ఆదరాభిమానాలతో తెలుగు తెరపై రాణిస్తున్నాను. -
మనుషుల్ని విడదీసే గోడ
‘‘గోడ, బ్రిడ్జ్ ఒకే మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ, గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్ మనుషుల్ని కలుపుతుంది. అదే ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా కథ. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేవన్ యాదు అన్నారు. రాహుల్ రవీంద్రన్ హీరోగా, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వాదాలతో ఈ.ఎమ్.వి.ఈ. స్టూడియోస్ పతాకంపై రూపొందిన ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా నాకొక లవ్లీ జర్నీ. డైరెక్టర్ చాలా క్లియర్‌గా అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చారు. చాందిని వెరీ టాలెంటెడ్. డైరెక్టర్ తర్వాత కెమెరామెన్ విజయ్ మిశ్రా హీరో అనొచ్చు. అంతమంచి క్వాలిటీతో సన్నివేశాలు తీశారు. నిర్మాతలు సపోర్టివ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘లాంగ్ అండ్ ఎమోషనల్ జర్నీ ఇది. సినిమా చాలా రిచ్‌గా వచ్చింది’’ అన్నారు చాందినీ చౌదరి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, మనాలి రాథోడ్ పాల్గొన్నారు. రావు రమేశ్, అజయ్ నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజు. -
మానవీయ విలువలకు వారధి
రాహుల్ రవీంద్రన్ హీరోగా రేవన్ యాదు దర్శకత్వంలో ఎమ్.వి. స్టూడియోస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ రిలేషన్స్కి ఈ కథ బ్రిడ్జ్‌గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటి? అనేది ఇప్పుడే చెప్పను. ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. రేవన్ యాదు మాట్లాడుతూ – ‘‘ఓ వంతెన (బ్రిడ్జ్) నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన కథ ఇది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, రెండో వారంలో ఆడియో, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: విజయ్ మిశ్రా, సంగీతం: శేఖర్ చంద్ర.