పశ్చిమబెంగాల్: ఈ మధ్య స్టార్ డమ్ కోసం యూట్యూబర్‌గా ఫేమస్ అవ్వడానికో చాలా మంది రద్దీగా ఉండే హైవేల పై రకరకాలుగా డ్యాన్స్ చేసి ట్రాఫిక్ పోలీసుల ఆగ్రహానికి గురైన సంఘటనలు గురించి చాలానే విన్నాం. అలాగే మరికొంతమంది తమ విహారయాత్ర మధుర స్మృతిలా గుర్తుండేపోయేలా విన్నూతనంగా పేరుగాంచిన బ్రిడ్జిలపై డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్యర్యపరుస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఎవరు చేశారు అని ఆత్రుతుగా ఉన్నారా.
(చదవండి: అది బైక్ ? విమానమా !)
వివరాల్లోకెళ్లితే....కోల్‌కతాకి ఐకానిక్‌గా పేరుగాంచిన హౌరా బ్రిడ్జ్ పై ఓ అమ్మాయి, అబ్బాయి శ్రీలంక గాయని యోహాని దిలోకా డి సిల్వా పాడిన సింహళ పాటకు నృత్యం చేశారు. అంతేకాదు ఈ పాట శ్రీలంకగాయనీ యోహానికి అంతర్జాతీయ గుర్తింపునున తెచ్చింది. ఈ మేరకు ఆమె ఈ పాటను ఈ ఏడాది మేలో యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ కాలేకపోయినప్పటికీ ఆ పాటకు నృత్యం చేసిన ఈ అబ్బాయి అమ్మాయిల వల్ల మాత్రం చాలామందికి చేరువైందని చెప్పక తప్పదు.
(చదవండి: ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ?)
Comments
Please login to add a commentAdd a comment