
రకుల్ ప్రీత్ సింగ్ ఎంత స్పీడ్‌గా స్టార్ హీరోయిన్ అనిపించుకుందో.. అంతే స్పీడ్‌గా ఫేడవుట్ అయిన భామల లిస్ట్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లో అదృష్టం కలిసి రాకపోయినా.. అక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక కోలీవుడ్‌లో కూడా రకుల్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం రకుల్ మన్మధుడు2లో నటిస్తోంది.
‘చి.ల.సౌ’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో కింగ్ నాగార్జునతో మన్మధుడు2 చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని కొట్టేశాడు. ఈ మూవీ షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. రకుల్‌పై ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రకుల్‌లో నమ్మలేనటువంటి ప్రతిభ ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జునకు, ‘వెన్నెల’ కిశోర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా స్క్రిప్ట్, డైలాగ్స్‌ను రెడీ చేశారట రాహుల్ రవీంద్రన్. రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
Contrary to some rumours, Rakul has been shooting with us from day one of the Portuguese schedule. We have all been gushing non-stop about how stunning she’s looking and thanking our lucky stars that we got her. What an incredible talent she is💛💛💛 Love to all😊😊😊
— Rahul Ravindran (@23_rahulr) April 18, 2019
Comments
Please login to add a commentAdd a comment