
అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు లాంటి చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసిన రాహుల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి బుధవారం సినిమాను ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు.
వివాహ వేదిక మీద ఉన్న చిll లll సౌll అనే అక్షరాలనే దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం మందిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
Since we have an auspicious title for our film... we decided to announce it with an auspicious poster:) So here goes... #ChiLaSow pic.twitter.com/qUCs37irB2
— Rahul Ravindran (@23_rahulr) 11 October 2017
Wow! So much positivity! Just got done with our pooja. Thanks a million everyone. Ever grateful 😊🙏🏽
— Rahul Ravindran (@23_rahulr) 11 October 2017




Comments
Please login to add a commentAdd a comment