నాగార్జున
దర్శకునిగా తొలి సినిమా ‘చి.ల.సౌ’ రిలీజ్ కాకముందే అన్నపూర్ణలాంటి బిగ్ బ్యానర్‌లో సినిమా చేసే ఛాన్స్‌ను దక్కించుకున్నారు రాహుల్ రవీంద్రన్. అటు నటుడిగానూ సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను లీడ్ చేస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించిన ‘చిలసౌ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేయబోతున్నారు రాహుల్. ఇందుకోసం ఆయన ఓ రొమాంటిక్ కథను కూడా రెడీ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు 2002లో నాగ్ నటించిన ‘మన్మథుడు’ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ని అక్కినేని కాంపౌండ్ రిజిస్టర్ చేయించిందనే వార్త వినిపిస్తోంది. ఈ టైటిల్ నాగార్జున– రాహుల్ రవీంద్రన్ సినిమాకేనా? అంటే వెయింట్ అండ్ సీ అంటున్నారట టీమ్. మరోవైపు రెండేళ్ల క్రితం నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జోరందుకుందట.
Comments
Please login to add a commentAdd a comment