ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ | Hyderabad Love Story's audio launched | Sakshi
Sakshi News home page

ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ

Published Sun, Jan 11 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ

ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ

 ‘‘సినిమా నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వినోదంతోపాటు సందేశం ఉన్న చిత్రాలు వస్తే బాగుంటుంది. ఈ చిత్రం టైటిల్ బాగుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా హీరో హీరోయిన్లుగా రాజ్ సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. ఎస్. పద్మజ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ పాటలు స్వరపరిచారు.
 
  ఆడియో సీడీని తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించి, ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో భీమినేని శ్రీనివాసరావు, వీఎన్ ఆదిత్య, జితేంద్ర, సందీప్ కిషన్, నవీన్‌చంద్ర, మనాలి రాధోడ్, దీక్షా పంత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాహారంతో సాగుతుంది’’ అన్నారు. ఇది ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అని దర్శకుడు తెలిపారు. సునీల్ మంచి పాటలిచ్చారని రాహుల్ రవీంద్రన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement