హైదరాబాద్ ప్రేమకథ | Hyderabad love story | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ప్రేమకథ

Published Tue, Oct 28 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

హైదరాబాద్ ప్రేమకథ

హైదరాబాద్ ప్రేమకథ

 హైదరాబాద్  ప్రేమకథ అనగానే టక్కున గుర్తొచ్చేది భాగమతి, కులీ కుతుబ్‌షాల ప్రేమగాధే. కాల గమనంలో కొన్ని వేల ప్రేమకథలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఆ ప్రేరణతో రూపొందుతోన్న చిత్రమే ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్, రేష్మీ మీనన్, జియా ప్రధాన పాత్రధారులు. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వినోదాత్మకంగా సాగే భిన్నమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్‌కు ఈ చిత్రంలోని ప్రేమకథకు ఉన్న అనుబంధం ఏంటో తెరపైనే చూడాలి. సునీల్‌కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 9న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. కెమెరా: బీవీ అమరనాథ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పిన్నింటి రాజేందర్‌రెడ్డి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, సమర్పణ: ఎస్.పద్మజ, నిర్మాణం: ఎస్‌ఎన్‌ఆర్ ఇండియా ప్రై.లిమిటెడ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement