ప్రేమ గురించి చెప్పేంత నటిని కాను | I am not an actress told about love | Sakshi
Sakshi News home page

ప్రేమ గురించి చెప్పేంత నటిని కాను

Published Sat, Aug 15 2015 8:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

ప్రేమ గురించి చెప్పేంత నటిని కాను

ప్రేమ గురించి చెప్పేంత నటిని కాను

ప్రేమ,పెళ్లి గురించి చెప్పుకునేంత పెద్ద నటిని కాను నేను అంటోంది నటి రేష్మీ మీనన్. అయితే ఇటీవల ఈమె ప్రేమ వ్యవహారమే కలకలం పుట్టించిదన్నది గమనార్హం. ఇంతకీ ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం చిత్రం మాత్రమే తెరపైకి వచ్చింది. అయితేనేం ఇప్పుడు ఐదు చిత్రాలు చేతిలో ఉన్న లక్కీ మలయాళ కుట్టి రేష్మీమీనన్‌తో చిన్న భేటీ..

ప్రశ్న: మలయాళీ భామలు చాలా ఫాస్ట్‌గా ఉంటారు. మీరేంటి సాఫ్ట్‌గా ఉన్నారు?
 జవాబు: నిజం చెప్పాలంటే మా పూర్వీకులు కేరళీయులు. నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే. ఇంకా చెప్పాలంటే తమిళం మాట్లాడినంత సరళంగా మలయాళంలో మాట్లాడలేను. నన్ను నేను తమిళ అమ్మాయిగానే భావించుకుంటున్నాను. నా స్నేహితులు, క్లాస్‌మేట్స్ అందరూ తమిళులే. ఇక సాధారణంగానే నేను రిజర్వ్‌డ్ టైప్. అయితే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు మాత్రం చాలా జాలీగా ఎంజాయ్ చేస్తా.

 ప్రశ్న: సరే నటరంగ ప్రవేశ ఉదంతం గురించి?
 జ: నేను నటినవ్వాలని కోరుకోలేదు. దర్శకురాలినవ్వాలనే కలలు కన్నాను.నా స్నేహితురాలు ఇనిదు ఇనిదు చిత్ర ఆడిషన్‌కు వెళుతూ నన్ను కూడా రమ్మంది. తీరా అక్కడికి వెళ్లిన తరువాత నన్ను ఆ అడిషన్‌లో పాల్గొనమన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే నేను సెలెక్ట్ అయ్యాను తను కాలేదు. నన్ను నటించమన్న స్నేహితురాలు ఒత్తిడి మేరకే నటినయ్యాను.

 ప్రశ్న: లఘు చిత్రాల్లో నటించారటగా?
 ప్రశ్న:  ఓ అదా’ నేను ఉమెన్ క్రిష్టియన్ కళాశాలలో విజ్‌కామ్ చదివాను. అప్పుడు ప్రాజెక్ట్ కోసం ఒక షార్ట్ ఫిలిమ్‌కు దర్శకత్వం వహించాను. అందులో కళాశాల స్నేహితులు నటించారు. బదులుకు వారి చిత్రాల్లో నేను నటించాను. అలా స్నేహం కోసం కొన్ని లఘు చిత్రాల్లో నటించాను.

 ప్రశ్న: ప్రస్తుతం ఏక కాలంలో ఐదు చిత్రాలు చేయడం గురించి?
 జ; నేనే నమ్మలేక పోతున్నాను. రెండు తమిళ చిత్రాలు, మూడు తెలుగు చిత్రాలు చేస్తున్నాను. తమిళంతో ఉరిమీన్, క్రిమి, నట్పధికారం చిత్రాల్లో ఏక కాలంలో నటిస్తున్నాను. ఉరిమీన్ చిత్రంలో ఐటీ రంగంలో పని చేసే అమ్మాయిగా, నట్పధికారం చిత్రంలో బ్రాహ్మణ యువతిగా క్రిమిలో ఉత్తర చెన్నై కి చెందిన అమ్మాయి అంటూ మూడు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించే అవకాశాలు రావడం సంతోషంగా ఉంది. ఈ మూడు చిత్రాలు నాకు ముఖ్యమైనవే.

ప్రశ్న: మీ పేరు చివర కులం పేరు తీసేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న దర్శకుడు కరు. పళనీయప్పన్ సూచనను పాఠిస్తారా?
 జ: పేరులో ఏముంది? ఇప్పుడు కులమతాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు. అవ న్నీ కుటుంబ పరంగా సంక్రమించేవి. నాకు కులమత భేదాలు లేవు. కాబట్టి పేరు మార్చుకోవలసిన అవసరం లేదనుకుంటున్నాను.
 
ప్రశ్న: చివరి ప్రశ్న. నటుడు బాబిసింహా మీరు ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి?

 జ: ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అయినా ప్రేమ, పెళ్లి విషయాల గురించి చెప్పుకునేంత పెద్ద నటిని కాను నేను. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నాను.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement