పెళ్లి సందేహమే! | doubt the wedding! | Sakshi
Sakshi News home page

పెళ్లి సందేహమే!

Published Thu, Mar 26 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

పెళ్లి సందేహమే!

పెళ్లి సందేహమే!

ప్రేమించినవాళ్లనే పెళ్లి చేసుకోవాలనే పట్టుదల చాలామందికి ఉంటుంది. కానీ, ప్రేమ వరకూ అయితే ఓకే... పెళ్లంటే పడదు అనే మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. ఈ రెండో రకానికి చెందినవారి కథతో శ్రీవారి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ ఓకే.. పెళ్ళే డౌట్’. శరగడం శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్. శ్రీనివాస్, ఎస్. సుధీర్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం సాగుతుంది. రాజ్ కిరణ్ మంచి పాటలు స్వరపరిచారు’’ అని చెప్పారు. కృష్ణుడు, రోషికా అగర్వాల్ ముఖ్య పాత్రలలో కిరణ్ మల్లిడి, మనస్విని నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: అప్పల నర్సమ్మ, నాగు నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement