గురువును పెళ్లాడటం... తప్పు కాదా?! | life suggestions tells Yandamuri Veerendranath | Sakshi
Sakshi News home page

గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!

Published Sun, Oct 18 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!

గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!

జీవన గమనం
నేనొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను చేస్తోన్న ఉద్యోగం నాకు సుఖాన్నిస్తోంది. కానీ నా నమ్మకాలకు వ్యతి రేకంగా పని చేస్తేనే ఆ ‘సుఖం’ నాకు లభి స్తోంది. ఇలా నమ్మకాలకి, మరింత సుఖపడ టానికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎలా సమన్వయపరచుకోవాలి? ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిందేనా?
 - నన్నపనేని, సామర్లకోట

 
‘నా నైతిక విలువల్ని వదులుకోవాలా, సుఖాన్ని వదులుకోవాలా’ అన్నది మీ ప్రశ్న. హోటల్లో ఇడ్లీ తింటున్నప్పుడు పక్క వాడి పూరీని చూసి, తప్పు నిర్ణయం తీసు కున్నామేమో అని బాధపడితే ఇడ్లీ ఏ మాత్రం సంతృప్తినివ్వదు. మీ ఉద్యోగం మీకు సుఖాన్నిస్తోంది కానీ సంతృప్తినివ్వ ట్లేదని రాశారు. ఒక పని సంతృప్తినివ్వక పోవడానికి కారణం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి - శారీరకంగా మనం ఆ పని చేయలేకపోయినప్పుడు. ఉదాహరణకి, రోగంతో బలహీనమైన వ్యక్తి రైల్వే కూలీగా పనిచేస్తే చాలా బాధపడవలసి ఉంటుంది.

రెండోది - మానసికంగా ఆ పని ఇష్టం లేకపోయినప్పుడు. ఉదాహర ణకి, సృజనాత్మకత ఉన్న ఒక కళాకారిణి బ్యాంక్‌లో రొటీన్ ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు చాలా నిరాసక్తత ఆవహి స్తుంది. మూడోది - చేస్తున్న పనికి, సిద్ధాంతాలకు నిరంతర ఘర్షణ జరుగుతున్నప్పుడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో కూడా లంచాలు, కమీషన్లు ఉంటాయి. మీ సమస్య మూడోదే అనుకుంటున్నాను. నైతిక విలువల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తికి, పక్క సీట్లో కూర్చుని లంచాలు తీసుకుం టున్న వ్యక్తి రోజురోజుకీ ధనవంతుడవడం చూసి... ‘తనకున్న నైతిక విలువ గొప్పదా ధనం విలువ గొప్పదా’ అన్న సంఘర్షణ మొదలవుతుంది.

మీ సమస్య ఇదే అయితే ముందొక నిర్ణయం తీసుకోండి. సుఖం అనేది రెలిటివ్ టర్మ్. దానికి అంతు లేదు. డబ్బు నిశ్చయంగా సుఖాన్ని స్తుంది. కానీ ఆనందాన్ని ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం మీకు బతకటానికి లోటు లేదు కదా! నిరంతరం ‘నేను చాలా మంచివాడిని, అందుకే నాకిన్ని బాధలు’ అని మనసులో సంఘర్షిస్తూ ఉంటే ఆనందం ఎప్పటికీ దొరకదు.

నేను నైతిక విలువలు కోల్పో మని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. ఘర్షణను వదులుకుని జీవించమని చెప్తున్నానంతే. లంచం పొందడానికి వీలున్న కుర్చీలో కూర్చుని కూడా నిజాయితీగా బతికేవాడి మొహంలో ఉండే ప్రశాంతత, విలువలు కోల్పోయిన వ్యక్తి ముఖంలో ఉండదు. కష్టపడి సంపాదించే డబ్బు సంతృప్తినిస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట.
 
నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా కాలేజీలో ఒక లెక్చెరర్ దగ్గర సాయంత్రం ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. ఓ రోజు ఆయన ఒంటరిగా ఉన్న నా దగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పారు. నేనేం మాట్లాడ లేదు. గురువును ప్రేమించడం తప్పు అని నా ఉద్దేశం. కానీ ఆయన తనకే దురుద్దేశం లేదని, నేను కూడా సెటిలయ్యాక మా పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఆయనను నమ్మాలా? లేక నో చెప్పాలా?
 - సుజిత, నకిరేకల్

 
ఇందులో ‘నమ్మటం’ అన్న ప్రసక్తి ఎక్కడుంది? మీ అభ్యంతరం కేవలం ఆయన మీ ‘గురువు’ అన్నదొక్కటే అయితే, మిగతా అన్ని విషయా ల్లోనూ ఆయన కరెక్టుగా ఉంటే.. ఏమాత్రం సంశయించకుండా వివాహం చేసుకోవచ్చు. అయినా గురువును పెళ్లాడటం తప్పు అని ఎక్కడా రాసి లేదు. ఈ రోజుల్లో బీటెక్ పాసయిన కుర్రాళ్లే తర్వాతి సంవత్సరం లెక్చెరర్స్‌గా మారు తున్నారు. మీ ఉత్తరాన్ని బట్టి అతను మంచివాడిలానే కనిపిస్తున్నాడు. వయ సులో ఎక్కువ తేడా లేకపోతే నిరభ్యంత రంగా పెళ్లి చేసుకోవచ్చు. బెస్టాఫ్ లక్.
 
నేను ఎమ్మెస్సీ చదువుతున్నాను. కానీ నాది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే అని అందరూ అంటుంటారు. మా నాన్న అయితే ఎక్కడ పడితే అక్కడే తిట్టేస్తుంటారు. నాకు చాలా బాధనిపిస్తోంది. నిజానికి ఏ పని ఎలా చక్క బెట్టాలో నాకు తెలియదు. అందుకే అందరూ అనేది నిజమేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అనిపిస్తోంది. హాస్టల్లో ఉండి చదివితే మైండ్ మెచ్యూరవుతుందని విన్నాను. నేనెప్పుడూ హాస్టల్లో లేను. అందుకే నా మైండ్ ఎదగలేదా?
- సునీల్, అనంతపురం
 

ఒక తాగుబోతు తండ్రి కన్నా, పిల్లల్ని సరిగ్గా పెంచలేని తండ్రి నికృష్టుడు అని ఎక్కడో చదివాను. ఎదిగిన పిల్లల్ని అందరి ముందూ తిడితే వాళ్ల మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రతి తండ్రీ తెలుసుకోవాలి. మీకు జ్ఞానం లేక పోవడానికి (కనీసం మీరు అలా అను కుంటూ ఉండడానికి) కారణం మీ తండ్రి ఒక్కరే కాకపోవచ్చు. ఏదేమైనా, హాస్టల్లో ఉండి చదువుకుంటే మైండ్ మెచ్యూర్ అవుతుందనుకోవడం నూరుపాళ్లూ నిజం కాదు. మీరు ఎలానూ మరికొంత కాలానికి ఉద్యోగంలో ప్రవేశిస్తారు. అప్పుడు సహజంగానే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. చదువు ఆఖరి దశలో ఇల్లు వదిలి హాస్టల్‌లో చేరితే కొత్త సమస్యలు రావచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా కొంతకాలం ఆగండి.                                     
- యండమూరి వీరేంద్రనాథ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement