Reshma Menon
-
హైదరాబాద్ ప్రేమకథ
‘అలా ఎలా’ చిత్రంతో యువతను ఆకట్టుకున్న కథానాయకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. ఎస్.పద్మజ సమర్పణలో ఎస్ఎన్ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాజ్ సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి నిర్మించారు. రేష్మీ మీనన్, జియా కథానాయికలు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత సి.కల్యాణ్ చిత్రబృందానికి ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘నేను, ఎస్.ఎన్ రెడ్డి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. ఇప్పుడు ఇద్దరం సినిమా రంగంలోకి వచ్చేశాం. ట్రైలర్లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. రాహుల్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘ఈ చిత్రం నాకు మంచి అనుభవం. క్వాలిటీ విషయంలో ఎస్.ఎన్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడలేదు. జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు రాజ్ సత్య, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: బివి అమర్నాథ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నంటి, సహ నిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి. -
థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!
సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ‘నేనో రకం’. వంశీధర్ రెడ్డి సమర్పణలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ- ‘‘మారిన తెలుగు సినిమా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందింది. హీరోగా నా కెరీర్‌కు ఉపయోగపడే చిత్రమిది’’ అని అన్నారు. మా చిత్రం ఎన్నో వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ, సరికొత్త థ్రిల్ అందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. -
ప్రేమ గురించి చెప్పేంత నటిని కాను
ప్రేమ,పెళ్లి గురించి చెప్పుకునేంత పెద్ద నటిని కాను నేను అంటోంది నటి రేష్మీ మీనన్. అయితే ఇటీవల ఈమె ప్రేమ వ్యవహారమే కలకలం పుట్టించిదన్నది గమనార్హం. ఇంతకీ ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం చిత్రం మాత్రమే తెరపైకి వచ్చింది. అయితేనేం ఇప్పుడు ఐదు చిత్రాలు చేతిలో ఉన్న లక్కీ మలయాళ కుట్టి రేష్మీమీనన్‌తో చిన్న భేటీ.. ప్రశ్న: మలయాళీ భామలు చాలా ఫాస్ట్‌గా ఉంటారు. మీరేంటి సాఫ్ట్‌గా ఉన్నారు? జవాబు: నిజం చెప్పాలంటే మా పూర్వీకులు కేరళీయులు. నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే. ఇంకా చెప్పాలంటే తమిళం మాట్లాడినంత సరళంగా మలయాళంలో మాట్లాడలేను. నన్ను నేను తమిళ అమ్మాయిగానే భావించుకుంటున్నాను. నా స్నేహితులు, క్లాస్మేట్స్ అందరూ తమిళులే. ఇక సాధారణంగానే నేను రిజర్వ్డ్ టైప్. అయితే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు మాత్రం చాలా జాలీగా ఎంజాయ్ చేస్తా. ప్రశ్న: సరే నటరంగ ప్రవేశ ఉదంతం గురించి? జ: నేను నటినవ్వాలని కోరుకోలేదు. దర్శకురాలినవ్వాలనే కలలు కన్నాను.నా స్నేహితురాలు ఇనిదు ఇనిదు చిత్ర ఆడిషన్‌కు వెళుతూ నన్ను కూడా రమ్మంది. తీరా అక్కడికి వెళ్లిన తరువాత నన్ను ఆ అడిషన్లో పాల్గొనమన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే నేను సెలెక్ట్ అయ్యాను తను కాలేదు. నన్ను నటించమన్న స్నేహితురాలు ఒత్తిడి మేరకే నటినయ్యాను. ప్రశ్న: లఘు చిత్రాల్లో నటించారటగా? ప్రశ్న: ఓ అదా’ నేను ఉమెన్ క్రిష్టియన్ కళాశాలలో విజ్కామ్ చదివాను. అప్పుడు ప్రాజెక్ట్ కోసం ఒక షార్ట్ ఫిలిమ్‌కు దర్శకత్వం వహించాను. అందులో కళాశాల స్నేహితులు నటించారు. బదులుకు వారి చిత్రాల్లో నేను నటించాను. అలా స్నేహం కోసం కొన్ని లఘు చిత్రాల్లో నటించాను. ప్రశ్న: ప్రస్తుతం ఏక కాలంలో ఐదు చిత్రాలు చేయడం గురించి? జ; నేనే నమ్మలేక పోతున్నాను. రెండు తమిళ చిత్రాలు, మూడు తెలుగు చిత్రాలు చేస్తున్నాను. తమిళంతో ఉరిమీన్, క్రిమి, నట్పధికారం చిత్రాల్లో ఏక కాలంలో నటిస్తున్నాను. ఉరిమీన్ చిత్రంలో ఐటీ రంగంలో పని చేసే అమ్మాయిగా, నట్పధికారం చిత్రంలో బ్రాహ్మణ యువతిగా క్రిమిలో ఉత్తర చెన్నై కి చెందిన అమ్మాయి అంటూ మూడు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించే అవకాశాలు రావడం సంతోషంగా ఉంది. ఈ మూడు చిత్రాలు నాకు ముఖ్యమైనవే. ప్రశ్న: మీ పేరు చివర కులం పేరు తీసేస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న దర్శకుడు కరు. పళనీయప్పన్ సూచనను పాఠిస్తారా? జ: పేరులో ఏముంది? ఇప్పుడు కులమతాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు. అవ న్నీ కుటుంబ పరంగా సంక్రమించేవి. నాకు కులమత భేదాలు లేవు. కాబట్టి పేరు మార్చుకోవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ప్రశ్న: చివరి ప్రశ్న. నటుడు బాబిసింహా మీరు ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి? జ: ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అయినా ప్రేమ, పెళ్లి విషయాల గురించి చెప్పుకునేంత పెద్ద నటిని కాను నేను. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నాను. -
అందమైన ప్రేమకథ
‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని స్నేహితుడి పాత్రను పోషించిన విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రం ఆరంభం కానుంది. గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన రమణ మల్లం దర్శకత్వంలో కన్నెగంటి వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘విజయ్, రేష్మీ మీనన్ పాల్గొనగా ఇటీవల ఫొటోషూట్ చేశాం. జంట చూడచక్కగా ఉంది. ‘ఎవడే సుబ్రమణ్యం’లో రిషి పాత్ర ద్వారా అందర్నీ ఆకట్టుకున్న విజయ్ ఈ చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: సురేంద్రకృష్ణ, మాటలు: నిరూప్, సంగీతం: రథన్. -
ప్రేమలోకంలో విహరిస్తూ...
హీరో సాయిరామ్‌శంకర్ హీరోయిన్ రేష్మీమీనన్‌తో ప్రేమలో పడ్డారు. నిజంగా కాదులెండి...! సినిమాలో మాత్రమే...! వీరిద్దరూ జంటగా సుదర్శన్ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు పాటలు మినహా టాకీ పార్టు పూర్తి చేసుకుంది. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ-‘‘మంచి టీమ్‌తో కలిసి పనిచేస్తున్నా. నా కెరీర్లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు సుదర్శన్ చెప్పిన కథాకథనాలు నచ్చాయి. పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినా వాటిని కాదని ఈ సినిమా ఒప్పుకున్నా. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది’’ అని శరత్ కుమార్ అన్నారు. ఈ వారంలో టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహిత్ నారాయణ్, సమర్పణ: వంశీధర్ రెడ్డి. -
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ
‘‘సినిమా నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వినోదంతోపాటు సందేశం ఉన్న చిత్రాలు వస్తే బాగుంటుంది. ఈ చిత్రం టైటిల్ బాగుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా హీరో హీరోయిన్లుగా రాజ్ సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. ఎస్. పద్మజ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించి, ఎంపీ జితేందర్‌రెడ్డికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో భీమినేని శ్రీనివాసరావు, వీఎన్ ఆదిత్య, జితేంద్ర, సందీప్ కిషన్, నవీన్‌చంద్ర, మనాలి రాధోడ్, దీక్షా పంత్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. లవ్, ఎంటర్టైన్మెంట్ సమాహారంతో సాగుతుంది’’ అన్నారు. ఇది ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అని దర్శకుడు తెలిపారు. సునీల్ మంచి పాటలిచ్చారని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. -
నగరమే ప్రేమ నేపథ్యం
ప్రతి మనిషికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ ప్రేమకు డబ్బు, చదువు, ఉద్యోగం - ఇలా ఏదైనా నేపథ్యం కావచ్చు. కానీ తమ సినిమాలో ప్రేమకు హైదరాబాద్ నగరమే నేపథ్యంగా నిలిచిందని దర్శకుడు రాజ్సత్య చెబుతున్నారు. రాహుల్ రవీంద్రన్, రేష్మీ మీనన్, జియా కాంబినేషన్లో పద్మజ. ఎస్ సమర్పణలో ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’. రొమాన్స్, ఫ్యాంటసీ, ఎమోషన్స్‌తో ఆద్యంతం ఈ చిత్రం ఆసక్తికరంగా రూపొందుతోందని, ఈ నెల 10న పాటలను, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహనిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి. -
హైదరాబాద్ ప్రేమకథ
హైదరాబాద్ ప్రేమకథ అనగానే టక్కున గుర్తొచ్చేది భాగమతి, కులీ కుతుబ్షాల ప్రేమగాధే. కాల గమనంలో కొన్ని వేల ప్రేమకథలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఆ ప్రేరణతో రూపొందుతోన్న చిత్రమే ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్, రేష్మీ మీనన్, జియా ప్రధాన పాత్రధారులు. రాజ్ సత్య దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వినోదాత్మకంగా సాగే భిన్నమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్‌కు ఈ చిత్రంలోని ప్రేమకథకు ఉన్న అనుబంధం ఏంటో తెరపైనే చూడాలి. సునీల్‌కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 9న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. కెమెరా: బీవీ అమరనాథ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పిన్నింటి రాజేందర్‌రెడ్డి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, సమర్పణ: ఎస్.పద్మజ, నిర్మాణం: ఎస్ఎన్ఆర్ ఇండియా ప్రై.లిమిటెడ్. -
విభిన్నంగా కిరుమి
తమిళసినిమా: విభిన్న కథా చిత్రంగా కిరుమి చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు అనుచరణ్ అంటున్నారు. నవ దర్శకుడైన ఈయన ఆస్ట్రేలియూ అనే షార్ట్ ఫిలిం ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్నారు. జేపీఆర్ ఫిలింస్ పతాకంపై కె.జయరాం ఎల్ పృథ్విరాజ్, ఎం.జయరామన్, ఎస్ రాజేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చార్లీ, రేష్మీ మీనన్, వనిత, డేవిడ్ సాల్మన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఇదో వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. ప్రస్తుత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. చిత్ర హీరో కదిర్ మాట్లాడుతూ ఇది సాధారణ సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం కాదన్నారు. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందన్నారు. సహజత్వానికి దగ్గరగా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని నిర్మాతలు తెలిపారు. చిత్రానికి కె.సంగీతాన్ని అందిస్తుండగా పిసి శ్రీరామ్ శిష్యుడు అరుల్ విన్సెంట్ చాయాగ్రహణం అందిస్తున్నారని తెలిపారు.