ప్రేమలోకంలో విహరిస్తూ... | Sairam Shankar love in Reshma Menon | Sakshi
Sakshi News home page

ప్రేమలోకంలో విహరిస్తూ...

Published Tue, Mar 31 2015 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

ప్రేమలోకంలో విహరిస్తూ...

ప్రేమలోకంలో విహరిస్తూ...

హీరో సాయిరామ్‌శంకర్ హీరోయిన్ రేష్మీమీనన్‌తో ప్రేమలో పడ్డారు. నిజంగా కాదులెండి...! సినిమాలో మాత్రమే...! వీరిద్దరూ జంటగా సుదర్శన్ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు పాటలు మినహా టాకీ పార్టు పూర్తి చేసుకుంది. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ-‘‘మంచి టీమ్‌తో కలిసి పనిచేస్తున్నా. నా కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు సుదర్శన్ చెప్పిన కథాకథనాలు నచ్చాయి. పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినా వాటిని కాదని ఈ సినిమా ఒప్పుకున్నా. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది’’ అని శరత్ కుమార్ అన్నారు. ఈ వారంలో టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహిత్ నారాయణ్, సమర్పణ: వంశీధర్ రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement