రకుల్‌కు లక్కీచాన్స్‌ | Rakul Preet Singh in talks to play the female lead in Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

రకుల్‌కు లక్కీచాన్స్‌

Published Sun, Feb 18 2018 4:06 AM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM

Rakul Preet Singh in talks to play the female lead in Sivakarthikeyan  - Sakshi

రకుల్‌ప్రీత్‌సింగ్‌

తమిళసినిమా: సినీ తారలకు ముఖ్యంగా కథానాయికలు ఇక్కడ లేకుంటే అక్కడ, అక్కడ కాకుంటే మరో భాషలో అవకాశాలను చేజిక్కింకుంటూనే ఉంటారు. వారికున్న అడ్వాంటేజ్‌ అదే. నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌నే తీసుకుంటే మొదట్లో ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. అయితే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అక్కడిప్పుడు కాస్త డల్‌ అనుకుంటున్న సమయంలో కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. నిజానికి స్పైడర్‌ చిత్రం రకుల్‌ను చాలా నిరాశపరచింది. అంతే కాదు విజయ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.

దీంతో రకుల్‌ మరింత డీలా పడిపోయిందనే చెప్పాలి. అలాంటి సమయంలో సూర్య బ్రదర్స్‌ ఆదుకున్నారు. కార్తీతో నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్ర విజయం రకుల్‌ప్రీత్‌సింగ్‌లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇక సూర్యకు జంటగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఈ అమ్మడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతే కాదు కార్తీతో మరోసారి కొత్త దర్శకుడు రజత్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించే చిత్రంలో నటించే చాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే హిందీలో నటించిన అయారి చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.

ఆజయ్‌దేవ్‌గన్‌తో మరో చిత్రం చేయనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌లో మరో బిగ్‌ అవకాశం రకుల్‌ప్రీత్‌సింగ్‌ తలుపుతట్టింది. అదే వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌తో జత కట్టడానికి రకుల్‌ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. శివకార్తికేయన్‌ ప్రస్తుతం పోన్‌రామ్‌ దర్శకత్వంలో సమంతతో కలిసి సీమరాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తదుపరి ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్‌ రవికుమార్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇది సైంటిఫిక్‌ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం అట. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాత్ర చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని చిత్ర దర్శకుడు అంటున్నారు.  చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా ఉంటుందట. దీనికి సంగీతమాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతబాణీలు కట్టనున్నారు. చిత్రం జూన్‌లోగానీ జూలైలో గానీ సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement