ఆ సినిమా నుంచి నన్ను తొలగించారా..? | Rakul Preet Singh Quashes Reports Of Refusing To Shoot For Ayalaan | Sakshi
Sakshi News home page

ఆ చిత్రం నుంచి నన్ను తొలగించారా..?

Published Mon, Jun 29 2020 9:23 AM | Last Updated on Mon, Jun 29 2020 9:25 AM

Rakul Preet Singh Quashes Reports Of Refusing To Shoot For Ayalaan - Sakshi

టాలీవుడ్‌లో ఇంతకుముందు ఒక వెలుగు వెలిగిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడ స్టార్‌ హీరోలందరితోనూ జత కట్టిన ఈ బ్యూటీకి ఇప్పుడు అక్కడ అవకాశాలు కరువయ్యాయి. అయితే అంతకు ముందే కోలీవుడ్‌లో మకాం పెట్టిన ఉత్తరాది బామ్మకు ఇక్కడ చాలాకాలం విజయాలు అందలేదు. ఆ తర్వాత కార్తీతో నటించిన ధీరన్‌ అధిగారం ఒండ్రు చిత్రం విజయాన్ని అందించింది. అయితే ఇక్కడ అంతకముందు, ఆ తరువాత నటించిన ఏ చిత్రం సక్సెస్‌ కాలేదు. దీంతో కోలీవుడ్‌ను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో నటుడు శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం వరించింది. అయితే ఆ చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరిగింది. అలాంటి సమయంలో రకుల్‌కి ఏకంగా శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్‌–2 చిత్రం లో నటించే లక్కీచాన్స్‌ వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా షూటింగ్‌లో క్రేన్‌ పడిపోవడం నలుగురు దాని కింద పడి చనిపోవడం వంటి సమస్యల కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ఆ తరువాత కరోనా వ్యాప్తి చెందడంతో చిత్ర పరిశ్రమే స్తంభించిపోయింది.

 కాగా షూటింగ్‌తో చిత్ర పరిశ్రమ మళ్లీ ఎప్పుడు కళకళలాడుతోంది తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శివకార్తికేయన్‌కు జంటగా నటించే అయలన్‌ చిత్రం నుంచి తొలగించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. ఇండ్రు నేట్రు నాళై చిత్రం తర్వాత రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అయలన్‌. ఇందులో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను కథానాయకిగా ఎంపిక చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ పూజాకార్యక్రమాలతోనే  నిలిచిపోయింది. కాగా లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత షూటింగ్‌ ప్రారంభం కానుందని  సమాచారం. అయితే కరోనా భయంతో ఈ చిత్ర షూటింగ్‌ లో పాల్గొనడానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నిరాకరించినట్లు, దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

దీనిపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియా ఎప్పుడు నిజాలను ప్రచారం చేస్తుందో తెలియడం లేదని వాపోయింది. వాస్తవాలను ప్రచారం చేస్తే బాగుంటుందని తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇకపోతే తనను అయలన్‌ చిత్రం నుంచి తొలగించారన్నది పూర్తిగా అవాస్తవం అని చెప్పింది. అసలు షూటింగ్‌ ఎప్పుడు మొదలైందని, అందులో పాల్గొనడానికి తాను నిరాకరించినట్లు ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నించింది. నిజానికి అయలన్‌ చిత్ర షూటింగ్లో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రకుల్‌ పేర్కొంది. అదేవిధంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ విషయం గురించి ఆ చిత్ర దర్శకుడు రవికుమార్‌ స్పందిస్తూ తన పనిచేసిన కళాకారులు అందరిలోకి అత్యంత అంకిత భావం కలిగిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అని పేర్కొన్నారు. అలాంటిది ఆమెను తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. అదే విధంగా తమ యూనిట్‌ అంత  చిత్ర షూటింగ్‌ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement