తమిళ సినిమా: ఏ రంగంలోనైనా, ఎవరికైనా గ్యాప్ రావడం అనేది సహజం. అలాంటి వారు మళ్లీ టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. తొలి చిత్రంతో మంచి విజయం సాధించిన ఈ దర్శకుడు ఆ తర్వాత విజయకాంత్‌తో రమణ, సూర్య కథానాయకుడిగా గజిని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందారు. విజయ్ హీరోగా కత్తి, తుపాకీ, సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలకీ దర్శకత్వం వహాంచిన మురుగదాస్ చివరిగా రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ చిత్రం చేశారు. అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతే మురుగదాస్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్ 65వ చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాల్సి ఉంది.
అయితే ఏమైనా అది జరగలేదు దర్బార్ తర్వాత మురుగదాస్ ఇప్పటి వరకు ఏ చిత్రం చేయలేదు. ఇటీవల త్రిష కథానాయక నటించిన రాంకీ చిత్రానికి కథను అందించారు. ఈయన మళ్లీ ఎప్పుడు దర్శకత్వం వహిస్తారా..? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చినట్లు కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. ఏఆర్ మురుగదాస్ నటుడు శివ కార్తికేయన్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. దీన్ని లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మించినట్లు టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుపడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అయిలాన్ చిత్రాన్ని పూరి చేసి మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment