'Boo' Movie Streaming On JioCinema OTT Platform - Sakshi
Sakshi News home page

Boo Movie: ఓటీటీలోకి వచ్చేసిన బూ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sat, May 27 2023 11:45 AM | Last Updated on Sat, May 27 2023 11:55 AM

Boo Streaming on Jio Cinema OTT Platform - Sakshi

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా తయారవుతున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లు కూడా వెబ్‌ సిరీస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఓటీటీల కోసమే చిత్రాలను రూపొందిస్తున్న పరిస్థితి నెలకొంది. దర్శకుడు విజయ్‌ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం బూ. ఈ థ్రిల్లర్‌ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు భాషల్లో శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు విజయ్‌ పేర్కొంటూ.. ఈ సినిమాను కరోనా సమయంలో రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన రామాంజనేయులు, ఎం. రాజశేఖర్‌ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను పొందిన జియో స్టూడియోకు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ చిత్రంలో నటుడు విశ్వక్‌సేన్‌, నటి రకుల్‌ ప్రీతిసింగ్‌, నివేదా పేతురాజ్‌, మేఘా ఆకాష్‌, రెబా మౌనిక జాన్‌, మంజిమా మోహన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారని పేర్కొన్నారు. జీవీ. ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని, సందీప్‌ చాయాగ్రహణం అందించారని తెలిపారు.

చదవండి: త్రివిక్రమ్‌పై బండ్ల గణేశ్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement