Boo
-
ఓటీటీలో బూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా తయారవుతున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఓటీటీల కోసమే చిత్రాలను రూపొందిస్తున్న పరిస్థితి నెలకొంది. దర్శకుడు విజయ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం బూ. ఈ థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు భాషల్లో శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు విజయ్ పేర్కొంటూ.. ఈ సినిమాను కరోనా సమయంలో రూపొందించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన రామాంజనేయులు, ఎం. రాజశేఖర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను పొందిన జియో స్టూడియోకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిత్రంలో నటుడు విశ్వక్సేన్, నటి రకుల్ ప్రీతిసింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, రెబా మౌనిక జాన్, మంజిమా మోహన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారని పేర్కొన్నారు. జీవీ. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని, సందీప్ చాయాగ్రహణం అందించారని తెలిపారు. చదవండి: త్రివిక్రమ్‌పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు -
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
మీరు ఓటీటీ సినీ ప్రియులా? సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోనే చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ వారంలో పలు చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈవేసవిలో మీకు ఆనందాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న పలు ఆసక్తికర సినిమాలు, వెబ్సిరీస్లేవో ఓ లుక్కేయండి. హారర్ మూవీ 'బూ' విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మోనికా, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ 'బూ'. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈనెల 27 నుంచి జియో సినిమాలోస్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ఏమయ్యాయి? పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా మెప్పించిన నటుడు జగదీష్ ప్రతాప్ భండారి. జగదీశ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ఈ సినిమా ఈ నెల 26న నేరుగా ఆహాలో విడుదల కానుంది. కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ సల్మాన్‌ఖాన్, పూజా హెగ్డే జంటగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎట్టకేలకు వస్తున్న తోడేలు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ భేడియా. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. సిటాడెల్ ఫైనల్ ఎపిసోడ్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో రిచర్డ్ మ్యాడన్, జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరిసీ చివరి ఎపిసోడ్ మే 26 స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ విక్టిమ్/సస్పెక్ట్- (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది. మదర్స్ డే -(హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యూబర్- (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. దసరా -(హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. ఆపరేషన్ మేఫెయిర్- (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. బీడ్ (హిందీ) -స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడ్ అండ్ గోల్డ్ -(జర్మన్) మే 26 టిన్ అండ్ టీనా- (స్పానిష్) మే 26 టర్న్ ఆఫ్ ది టైడ్ -(పోర్చుగీస్) నెట్‌ఫ్లిక్స్ సిరీస్-1 మే26 చోటా భీమ్- (హిందీ) సిరీస్-18 మే 26 బ్లడ్ అండ్ గోల్డ్- (హాలీవుడ్) మే 26 అమెజాన్ ప్రైమ్ మిస్సింగ్- ఒరిజినల్ మూవీ ‘పంచువమ్ అద్భుత విళక్కుమ్-మలయాళం/తెలుగు-మే 26 జియో సినిమా థగ్స్ -తెలుగు/తమిళ్/హిందీ క్రాక్ డౌన్ -వెబ్‌సిరీస్-సీజన్2 చిత్రకూట్ -హిందీ) మే 27 జీ5 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై- ఒరిజినల్ మూవీ- మే 23 విడుదల: పార్ట్-1 -తెలుగు డిస్నీ+హాట్‌స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్- వెబ్‌సిరీస్- మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ -వెబ్‌సిరీస్ -3- మే 26 ఆహా గీతా సుబ్రహ్మణ్యం- తెలుగు సిరీస్-3 - మే 23 -
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న యంగ్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హారర్ మూవీ 'బూ'. డైరెక్టర్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!) ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. (ఇది చదవండి: మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!) The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost! Exclusive World Premiere | May 27th @officialjiocinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOOhttps://t.co/3oIFMqmZhR@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha… — Manjima Mohan (@mohan_manjima) May 23, 2023 -
బూ.. ఇక లేదు!
శాన్ఫ్రాన్సిస్కో: బూ.. ప్రపంచంలోనే అందమైన కుక్కపిల్ల పేరిది. పొమరేనియన్ జాతికి చెందిన ఈ కుక్కపిల్ల సోషల్ మీడియాలో స్టార్. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో బూ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఫేస్బుక్లో దానికి 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటీ 60 లక్షల మంది అన్నమాట. దాని పేరు మీద ఉన్న ఫేస్బుక్ పేజీని ఫేస్బుక్ వెరిఫై కూడా చేసింది అంటే అర్థం చేసుకోండి.. ఆ కుక్కకు ఎంత పాపులారిటీ ఉందో. అయితే.. తనకు ఉన్న కోటీ 60 లక్షల మందిని బాధలో ముంచెత్తి అందనంత దూరం వెళ్లిపోయింది బూ. గుండెకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్న బూ.. చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది. దానికి 12సంవత్సరాలు. గత సంవత్సరం దాని ఫ్రెండ్ బడ్డీ చనిపోయిందట. అది కూడా సోషల్ మీడియా స్టారే. ఎక్కిడికెళ్లినా ఈ రెండు కలిసే వెళ్లేవట. అది చనిపోగానే.. బూ దిగులు పెట్టుకుందట. అలాగే కుంగిపోయిన బూ.. చివరకు గుండె సమస్యతో తుది శ్వాస విడిచిందంటూ బూ యజమాని ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. వరల్డ్ క్యూటెస్ట్ డాగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే బూను 2012లో వర్జిన్ అమెరికా అఫిషియల్ పెట్ అధికారిగా నియమించారు. 2011లో ‘బూ.. ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్ క్యూటెస్ట్ డాగ్’ పేరుతో ఓ బుక్‌ను కూడా ప్రచురించారు.