
శాన్‌ఫ్రాన్సిస్కో: బూ.. ప్రపంచంలోనే అందమైన కుక్కపిల్ల పేరిది. పొమరేనియన్ జాతికి చెందిన ఈ కుక్కపిల్ల సోషల్ మీడియాలో స్టార్. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో బూ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఫేస్‌బుక్‌లో
దానికి 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటీ 60 లక్షల మంది అన్నమాట. దాని పేరు మీద ఉన్న ఫేస్‌బుక్ పేజీని ఫేస్‌బుక్ వెరిఫై కూడా చేసింది అంటే అర్థం చేసుకోండి.. ఆ కుక్కకు ఎంత పాపులారిటీ ఉందో. అయితే.. తనకు ఉన్న కోటీ 60 లక్షల మందిని బాధలో ముంచెత్తి అందనంత దూరం వెళ్లిపోయింది బూ.
గుండెకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్న బూ.. చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది. దానికి 12సంవత్సరాలు. గత సంవత్సరం దాని ఫ్రెండ్ బడ్డీ చనిపోయిందట. అది కూడా సోషల్ మీడియా స్టారే. ఎక్కిడికెళ్లినా ఈ రెండు కలిసే వెళ్లేవట. అది చనిపోగానే.. బూ దిగులు పెట్టుకుందట. అలాగే కుంగిపోయిన బూ.. చివరకు గుండె సమస్యతో తుది శ్వాస విడిచిందంటూ బూ యజమాని ఫేస్‌బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. వరల్డ్ క్యూటెస్ట్ డాగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే బూను 2012లో వర్జిన్ అమెరికా అఫిషియల్ పెట్ అధికారిగా నియమించారు. 2011లో ‘బూ.. ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్ క్యూటెస్ట్ డాగ్’ పేరుతో ఓ బుక్‌ను కూడా ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment