sanfrancisco
-
మేడం టుస్సాడ్.. మన శిల్పసంపద కంటే ఎక్కువా?
"శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి. కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుందరాధి పోజ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" ! ( హంపీక్షేత్రం కొడాలి & కామరాజుగడ్డ ) నేను శిక్షణలో భాగంగా బెంగుళూరు వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి పనిగట్టుకొని హంపీ, బేలూరు, హలబెలిలకు వెళ్లి అలనాటి విజయనగర సామ్రాజ్య గతవైభవ శిథిలాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన పద్యం ఇది. అమెరికా లాస్ ఏంజెల్స్ వెళ్ళినప్పుడు, హాలీవుడ్ బొలివెర్డ్ లోనున్న ‘ మేడం టుస్సాడ్ వాక్స్ మ్యూజియం ’ చూశాం. అప్పుడు పదేపదే నాకు జ్ఞాపకం వచ్చింది ఈ పద్యమే. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం 2009 లో ప్రారంభమైందట. దీని ముందున్న కింగ్ కాంగ్ పెద్ద ఆకృతి ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రదర్శించబడిన మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో , చార్లీ చాప్లిన్, బ్రూస్ లీ, బారక్ ఒబామా వంటి ఎంతోమంది ప్రముఖుల రూపాలను చూసినప్పుడు వాటిని సజీవమూర్తులా అన్నట్లుగా తయారుచేసి పెట్టిన కళాకారుల ప్రతిభాసామర్థ్యాలు మమ్మల్ని ముగ్దులను చేశాయి. అయితే అప్పట్లో అందులో నాకు ఇండియా వాళ్ళది ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. ఈ వాక్స్ కళను మ్యూజియం స్థాయికి అభివృద్ధి చేసిన మేడం, ఫ్రాన్స్‌కు చెందిన మేరీ టుస్సాడ్ ( 1761 - 1850 ) మూర్తికి చేతులెత్తి మొక్కాము. ఇప్పుడు మేడం టుస్సాడ్ & సన్స్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీరు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి మ్యూజియంలను స్థాపించి ,అందులో సినిమా నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల మూర్తులను పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూపోతున్నారు. నిజమే కానీ ఇవన్నీ ఉత్త మైనపు బొమ్మలు మాత్రమేనన్న విషయం మనం మరిచిపోవద్దు. వీటితో పోల్చినప్పుడు కఠిన శిలలను శిల్పాలుగా, దేవతా మూర్తులుగా, మలిచిన మన శిల్పుల గొప్పదనం అర్థమౌతుంది. ఎన్నో కాలపరీక్షలను తట్టుకొని వేలవేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిలిచివున్న మన అపురూప కళాఖండాల విలువ తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మట్టితో భిన్న భిన్న ఆకృతుల వినాయక విగ్రహాలు చేసి అమ్ముకుంటున్న మన కళాకారుల వ్యాపారమంతా ఇప్పటికీ సరియైన ఆదరణ లేక రోడ్ల మీదనే కదా జరుగుతుంది. బ్రిటిషర్స్ పరాయి పాలకులైనా, భిన్న మతస్తులైన భారతదేశ చరిత్ర, సంస్కృతికి సాక్ష్యాలైన మన శిల్ప, శాసన సంపత్తిని చాలావరకు కాపాడగలిగారు. అపాటి కృషి స్వతంత్ర భారతంలో కూడా జరుగలేదన్నది చేదునిజం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎంతో అమూల్యమైన మన ప్రాచీన శిల్పసంపద సరియైన ఆదరణకు నోచుకోకుండా శిథిలమై కాలగర్భంలో కలిసిపోతుండడం విచారకరం. వీటిని కాపాడి ఎన్ని మ్యూజియంలైనా పెట్టవచ్చు. ప్రకృతివిపత్తులు, బయటివారి దండయాత్రలు, దేశ అంతర్గత మతబేధాల వల్ల మనం ఎంతో శిల్ప సంపదను కోల్పోయింది వాస్తవం . ఇప్పుడు ఉన్నదాన్నైనా కాపాడుకోలేక పొతే, మ్యూజియంల వంటి వాటిలో పరిరక్షించుకోలేకపోలే భావితరాలు మనల్ని క్షమించవన్న భావన నాకు మేడం టుస్సాడ్ మ్యూజియం సందర్శన ప్రేరణగా కలిగింది ! వేముల ప్రభాకర్(చదవండి: US : చర్మం రంగు.. కోటి తిప్పలు!) -
శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!
అమెరికా... అందులోనూ సిలికాన్ వాలీ అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో ఆసక్తి. ఐటీ ఇండస్ట్రీకి పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి ఇప్పుడు భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా శ్రీకర్ రెడ్డి పని చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ జిల్లా యాదాద్రి మోత్కూరు మండలంలోని కొండగడప శ్రీకర్ రెడ్డి స్వస్థలం. కాకతీయ వర్సిటీ నుంచి మెడిసిన్ చదివిన శ్రీకర్ రెడ్డి.. యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. జర్మనీలోని బెర్లిన్‌లో పనిచేసిన శ్రీకర్‌రెడ్డి.. దిల్లీలోని ఫారిన్ అఫైర్స్‌లో కూడా సేవలందించారు. ప్రస్తుతం భారత్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (ఐఎఫ్ఎస్) శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. The Consulate General of India, San Francisco @CGISFO announces with pleasure, Dr. Srikar Reddy has assumed charge as the Consul General. pic.twitter.com/WW09HDiwPl — India in SF (@CGISFO) August 21, 2023 బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సాక్షి టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. "రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్ పోర్ట్ అధికారిగా పని చేశాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సమయంలో శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో మంది తెలుగు వారు టెకీలుగా ఈ ప్రాంతంలో ఉన్నారు. భారత్, అమెరికా ప్రభుత్వాలు రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు ప్రయత్నించడం శుభదాయకం. అమెరికా వీసాల కోసం పెరుగుతున్న టైంలైన్ను ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. విద్యార్థుల డీపోర్టేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని" శ్రీకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడం తమకెంతో గర్వంగా ఉందంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. Srikar Reddy, IFS from Telangana, has been posted as CG of India at San Francisco, USA. He will be incharge of eight States there. We look forward to more trade and business promotion. Best wishes, Srikar. We are so proud of you.#TelanganaPolice pic.twitter.com/N5HOa4YTzE — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 12, 2023 (చదవండి: "మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు) -
ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్ నేత్రావల్కర్?
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో వాషింగ్టన్ ఫ్రీడమ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్.. భారత సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని శాసించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొయిసిస్ హెన్రిక్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియనార్ 29, అండ్రీస్ గౌస్ 23 పరుగులు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో హారిస్ రవూఫ్ మూడు వికెట్లు తీయగా.. ప్లంకెట్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్ నేత్రావల్కర్ బౌలింగ్ దాటికి టాపార్డర్ కకావికలమైంది. మధ్యలో కోరే అండర్సన్ (34 పరుగులు), ఆరోన్ ఫించ్ (14 పరుగులు) ప్రతిఘటించినప్పటికి లాభం లేకపోయింది. ఆ తర్వాత నేత్రావల్కర్ టెయిలెండర్ల పని పట్టడంతో శాన్ఫ్రాన్సిస్కో ఓటమి పాలైంది. ఎవరీ నేత్రావల్కర్? భారత్ సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ముంబై ప్రాంతంలో జన్మించాడు. అండర్-19 క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇక్కడ అవకాశాల్లేక అమెరికాకు వెళ్లిపోయాడు. మంచి లెఫ్టార్మ్ పేసర్‌గా ఎదిగిన నేత్రావల్కర్ ప్రస్తుతం అమెరికా జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. యూఎస్ఏ తరపున 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నేత్రావల్కర్ 48 వన్డేల్లో 73 వికెట్లు, 9 టి20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టుకు నేత్రావల్కర్ కెప్టెన్‌గానూ వ్యవహరించడం విశేషం. "KING OF SWING"😎 Saurabh Netravalkar takes a BRILLIANT😍 SIX-FOR to set his team up for success! pic.twitter.com/oY6o1cMqrK — Major League Cricket (@MLCricket) July 23, 2023 చదవండి: #LinDan: సినిమాల్లో 'డాన్'లు చాలా మందే.. బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక్కడే 'డాన్' -
అమెరికా ఉపాధ్యక్షురాలి ఇల్లు కొంటారా? ధర ఎంతంటే..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారీస్ తన ఇల్లు విక్రయానికి పెట్టింది. శాన్ఫ్రాన్సిస్కోలోని తన ఇంటిని అమ్మేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ ఇంటిని 799 వేల డాలర్లకు విక్రయించనున్నారు. ఈ మేరకు కమలా హ్యారీస్ ఓ వెబ్‌సైట్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. భవనంతో ఉన్న17 ఏళ్ల అనుబంధాన్ని కమలా తెంచుకోనుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని సౌతాఫ్ మార్కెట్లో ఓ అపార్ట్మెంట్ పై అంతస్తులో కమలా హ్యారీస్‌కు అపార్ట్మెంట్ ఉంది. 2004లో దీన్ని ఆమె కొనుగోలు చేశారు. అప్పట్లో 489,000 డాలర్లకు ఆమె కొనుగోలు చేయగా ఇప్పుడు 799,000 డాలర్లకు విక్రయించాలని నిర్ణయించింది. అధునాతన సౌకర్యాలు.. మంచి ఫర్నీషింగ్తో ఈ ఇల్లు ఉందని తెలుస్తోంది. ఈ ఇంటితో ఆమెకు 17 ఏళ్ల అనుబంధం ఉంది. పడకగదులు, హాల్, వంటగదులతో ఉన్న ఈ ఇంటిలో ఓ చిన్నపాటి కార్యాలయం కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. మంచి సీలింగ్‌తో ఈ ఇల్లు ఉందని జిల్లో వెబ్సైట్ ఆ భవనం ఫొటోలతో పాటు ఇంటికి సంబంధించిన వివరాలు చెప్పింది. ఉపాధ్యక్షురాలు కావడంతో కమల వాషింగ్టన్కు మకాం మార్చింది. ప్రస్తుతం ఉపాధ్యక్షుల అధికారిక నివాసం నంబర్ వన్ అబ్జర్వేరీ సర్కిల్‌ను మరమ్మతులు చేస్తుండడంతో ప్రస్తుతానికి కమలా హ్యారీస్ శ్వేతసౌధం సమీపంలోని బ్లెయిర్ హౌజ్‌లో నివసిస్తున్నారు. మరమ్మతులు పూర్తయితే అధికారిక నివాసంలోకి వెళ్లనున్నారు. -
ట్రంప్ మద్దతుదారుల అట్టర్‌ఫ్లాప్ షో
శాన్ఫ్రాన్సిస్కో: ఎన్నికల్లో ఓడిపోయినా ఎలాగైనా పదవిని పట్టుకుని వేలాడాలనుకున్న వ్యక్తి డొనల్డ్ ట్రంప్. అధ్యక్ష పదవిలో ఉండేందుకు అడ్డదారులు తొక్కి ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న అమెరికాను అభాసుపాలయ్యేలా చేశాడు. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియా బహిష్కరించింది. ఈ క్రమంలోనే మొన్న ట్విట్టర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. అయితే ఈ ఖాతా తొలగింపుపై కూడా ట్రంప్ మద్దతుదారులు బీభత్సం చేయాలని భావించారు. కానీ వారు చేయాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం అట్టర్ ఫ్లాపయ్యింది. క్యాపిటల్ హౌస్‌పై దాడిని ప్రేరేపించారని తెలియడంతో 88 మిలియన్ల మంది ఫాలోయింగ్ ఉన్న ట్రంప్ ఖాతాను నిలిపివేసిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం (జనవరి 11) ట్రంప్ మద్దతుదారులు, అభిమానులు ఆందోళన చేయాలని సిద్ధమయ్యారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అక్కడి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని ట్రంప్ అభిమానులు డిమాండ్‌పై నిరసనకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ట్రంప్ అభిమానులు హాజరయ్యారు. పోలీస్ బందోబస్తు చూసి చాలామంది భయపడి విరమించుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. డొనల్డ్ ట్రంప్ ఖాతాలను ఫేసుబుక్, స్నాప్‌చాట్ కూడా నిషేధించింది. మిగతా సోషల్ మీడియా సంస్థలు ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలో అత్యంత పరువు పోగొట్టుకున్న అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారని పలువురు పేర్కొంటున్నారు. -
ఎంతో మందిని చదివించాడు కానీ పన్నులు ఎగ్గొట్టాడు
వాషింగ్టన్: రాబర్ట్ స్మిత్ ఈ పేరు చాలా మందికి తెలిసే వుంటుంది. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ విస్తా ఈక్విటీ పార్ట్నర్ను స్థాపించి ఆ బిజినెస్‌లో ఉన్నత స్థానానికి ఎదిగారు. అంతే కాకుండా ఆయన గొప్ప మానవతావాది. గతేడాది మోర్ హౌస్ కాలేజీలో ఉన్న గ్రాడ్యూయేట్ విద్యార్థుల అందరి ఫీజులు చెల్లించి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఇదిలావుండగా స్మిత్ 15ఏళ్లుగా వేలకోట్ల రూపాయల పన్ను ఎగ్గొటారని శాన్ఫ్రాన్సిస్కో ఆటర్నీ డేవిడ్ ఆండర్సన్ తెలిపారు. అమెరికాలోనే అత్యంత ట్యాక్స్ కుంభకోణం రెండు బిలియన్ డాలర్ల కేసులో నేరస్తుడిగా ఉన్న రాబర్ట్ బ్రోక్మన్ కేసు విచారణలో స్మిత్‌ను విచారించారు. అందుకు సహకరించడానికి స్మిత్ ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే స్మిత్ 15 ఏళ్లుగా వివిధ రకాల ట్రస్ట్‌లు, కార్పొరేషన్ల ద్వారా ఫారెన్ ఫండ్లను తప్పుదారి పట్టించి వాటి ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు డేవిడ్ ఆండర్సన్ తెలిపారు. ఇక వీటికి సంబంధించి 139 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు మరిన్ని విషయాలను సేకరిస్తున్నారు. చదవండి: ప్రధానివా.. మోడల్‌వా? -
బూ.. ఇక లేదు!
శాన్ఫ్రాన్సిస్కో: బూ.. ప్రపంచంలోనే అందమైన కుక్కపిల్ల పేరిది. పొమరేనియన్ జాతికి చెందిన ఈ కుక్కపిల్ల సోషల్ మీడియాలో స్టార్. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో బూ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఫేస్బుక్లో దానికి 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటీ 60 లక్షల మంది అన్నమాట. దాని పేరు మీద ఉన్న ఫేస్బుక్ పేజీని ఫేస్బుక్ వెరిఫై కూడా చేసింది అంటే అర్థం చేసుకోండి.. ఆ కుక్కకు ఎంత పాపులారిటీ ఉందో. అయితే.. తనకు ఉన్న కోటీ 60 లక్షల మందిని బాధలో ముంచెత్తి అందనంత దూరం వెళ్లిపోయింది బూ. గుండెకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్న బూ.. చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది. దానికి 12సంవత్సరాలు. గత సంవత్సరం దాని ఫ్రెండ్ బడ్డీ చనిపోయిందట. అది కూడా సోషల్ మీడియా స్టారే. ఎక్కిడికెళ్లినా ఈ రెండు కలిసే వెళ్లేవట. అది చనిపోగానే.. బూ దిగులు పెట్టుకుందట. అలాగే కుంగిపోయిన బూ.. చివరకు గుండె సమస్యతో తుది శ్వాస విడిచిందంటూ బూ యజమాని ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. వరల్డ్ క్యూటెస్ట్ డాగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే బూను 2012లో వర్జిన్ అమెరికా అఫిషియల్ పెట్ అధికారిగా నియమించారు. 2011లో ‘బూ.. ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్ క్యూటెస్ట్ డాగ్’ పేరుతో ఓ బుక్‌ను కూడా ప్రచురించారు. -
తస్కరించాలని చూస్తే.. ఇక అంతే!
సైకిల్ ఎక్కడైనా పెట్టి తాళం వేసి ప్రశాంతంగా ఉండగలమా? ఎంత తాళాలు వేసినా ఎవరు దొంగిలిస్తారో అని అనుమానంగానే ఉంటుంది. మిగిలిన తాళాల సంగతి ఏమోగానీ.. తాము తయారు చేసిన సరికొత్త తాళం వాడితే మాత్రం సైకిళ్లు ఎక్కడికీ పోవని తయారీదారులు గ్యారంటీగా చెబుతున్నారు. ఎందుకంటే ఎవరైనా దొంగలు ఆ తాళం తీయాలని ప్రయత్నిస్తే వాళ్లకు ఆగకుండా వాంతులు అవుతాయట! షంక్లాక్ అనే ఈ కొత్త తాళాన్ని తాము విభిన్నంగా తయారు చేశామని దీని తయారీదారుడు అమెరికాలోని శానిఫ్రాన్సిస్కోకు చెందిన డేనియల్ ఇడ్జ్కోవ్స్కీ చెబుతున్నారు. తమ సైకిళ్లు కూడా తాళాలు వేసి పెట్టినా పోయాయని, అందుకే కాస్త బలమైన తాళం తయారు చేయాలని అనుకున్నామని ఇడ్జ్కోవ్స్కీ తెలిపారు. ఆరు నెలల పాటు కష్టపడి ఆలోచించిన తర్వాత ఈ షంక్లాక్ అనే కొత్తరకం తాళం తయారుచేశామన్నారు. దీన్ని ఎవరైనా కోయాలని ప్రయత్నించగానే.. లోపల ఒక రకమైన రసాయనం ఉంటుందని, అది దొంగల శరీరంలోకి ప్రవేశించి, వాళ్లకు ఆగకుండా వాంతులు అవుతాయని అన్నారు. నేరుగా తాళం చెవి పెట్టి తీస్తే మాత్రమే ఇది సురక్షితమని.. అలా కాకుండా మరే రకంగా తెరవాలని ప్రయత్నించినా అవతలి వాళ్ల పని అంతేనని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జూన్‌లో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ తాళం ధర మన కరెన్సీలో రూ. 6,621 మాత్రమే.