అమెరికా ఉపాధ్యక్షురాలి ఇల్లు కొంటారా? ధర ఎంతంటే.. | Kamala Harris selling her apartment in San Francisco | Sakshi
Sakshi News home page

ధర ఎంతంటే.. అమెరికా ఉపాధ్యక్షురాలి ఇల్లు కొంటారా?

Published Fri, Feb 19 2021 5:17 PM | Last Updated on Fri, Feb 19 2021 5:37 PM

Kamala Harris selling her apartment in San Francisco  - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారీస్‌ తన ఇల్లు విక్రయానికి పెట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన ఇంటిని అమ్మేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తెలిపింది. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ ఇంటిని 799 వేల డాలర్లకు విక్రయించనున్నారు. ఈ మేరకు కమలా హ్యారీస్‌ ఓ వెబ్‌సైట్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. భవనంతో ఉన్న17 ఏళ్ల అనుబంధాన్ని కమలా తెంచుకోనుంది.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని సౌతాఫ్‌ మార్కెట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ పై అంతస్తులో కమలా హ్యారీస్‌కు అపార్ట్‌మెంట్‌ ఉంది. 2004లో దీన్ని ఆమె కొనుగోలు చేశారు. అప్పట్లో 489,000 డాలర్లకు ఆమె కొనుగోలు చేయగా ఇప్పుడు 799,000 డాలర్లకు విక్రయించాలని నిర్ణయించింది. అధునాతన సౌకర్యాలు.. మంచి ఫర్నీషింగ్‌తో ఈ ఇల్లు ఉందని తెలుస్తోంది. ఈ ఇంటితో ఆమెకు 17 ఏళ్ల అనుబంధం ఉంది. పడకగదులు, హాల్‌, వంటగదులతో ఉన్న ఈ ఇంటిలో ఓ చిన్నపాటి కార్యాలయం కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. 

మంచి సీలింగ్‌తో ఈ ఇల్లు ఉందని జిల్లో వెబ్‌సైట్‌ ఆ భవనం ఫొటోలతో పాటు ఇంటికి సంబంధించిన వివరాలు చెప్పింది. ఉపాధ్యక్షురాలు కావడంతో కమల వాషింగ్టన్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం ఉపాధ్యక్షుల అధికారిక నివాసం నంబర్‌ వన్‌ అబ్జర్వేరీ సర్కిల్‌ను మరమ్మతులు చేస్తుండడంతో ప్రస్తుతానికి కమలా హ్యారీస్‌ శ్వేతసౌధం సమీపంలోని బ్లెయిర్‌ హౌజ్‌లో నివసిస్తున్నారు. మరమ్మతులు పూర్తయితే అధికారిక నివాసంలోకి వెళ్లనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement