List of movies releasing this week on OTT platforms - Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

Published Thu, May 25 2023 4:26 PM | Last Updated on Thu, May 25 2023 5:56 PM

This Week OTT Release Movies In various Platforms - Sakshi

మీరు ఓటీటీ సినీ ప్రియులా? సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోనే చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ వారంలో పలు చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈవేసవిలో మీకు ఆనందాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లేవో ఓ లుక్కేయండి.

హారర్‌ మూవీ 'బూ'

విశ్వక్‌సేన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మోనికా, నివేదా పేతురాజ్‌, మేఘా ఆకాశ్‌, మంజిమా మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్‌ మూవీ 'బూ'. ఈ చిత్రానికి విజయ్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈనెల 27 నుంచి జియో సినిమాలోస్ట్రీమింగ్‌ కానుంది.

సత్తిగాని రెండెకరాలు ఏమయ్యాయి?

పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్‌ స్నేహితుడు కేశవగా మెప్పించిన నటుడు జగదీష్‌ ప్రతాప్‌ భండారి. జగదీశ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ఈ సినిమా ఈ నెల 26న నేరుగా ఆహాలో  విడుదల కానుంది. 

కిసీ కా భాయ్.. కిసీ కి జాన్

సల్మాన్‌ఖాన్‌, పూజా హెగ్డే జంటగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌'. తెలుగు హీరో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తమిళ సూపర్‌ హిట్‌ ‘వీరమ్‌’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ఎట్టకేలకు వస్తున్న తోడేలు

వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ మూవీ భేడియా. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో విడుదల చేశారు. అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జియో సినిమాలో  స్ట్రీమింగ్‌ కానుంది.

సిటాడెల్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ సిటాడెల్‌. ఈ సిరీస్ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వెబ్‌ సిరీస్‌లో రిచర్డ్‌ మ్యాడన్‌, జోన్స్‌, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరిసీ చివరి ఎపిసోడ్‌ మే 26 స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌

  •  విక్టిమ్‌/సస్పెక్ట్‌- (హాలీవుడ్) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • మదర్స్‌ డే -(హాలీవుడ్‌)-  స్ట్రీమింగ్‌ అవుతోంది.
  •  ఫ్యూబర్‌- (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  •  దసరా -(హిందీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ఆపరేషన్‌ మేఫెయిర్‌- (హిందీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • బీడ్‌ (హిందీ) -స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ -(జర్మన్‌) మే 26
  • టిన్‌ అండ్‌ టీనా- (స్పానిష్‌) మే 26
  • టర్న్‌ ఆఫ్‌ ది టైడ్‌ -(పోర్చుగీస్‌) నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌-1 మే26
  • చోటా భీమ్‌- (హిందీ) సిరీస్‌-18 మే 26
  • బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌- (హాలీవుడ్‌) మే 26

అమెజాన్‌ ప్రైమ్‌

  •  మిస్సింగ్‌- ఒరిజినల్‌ మూవీ
  •  ‘పంచువమ్‌ అద్భుత విళక్కుమ్‌-మలయాళం/తెలుగు-మే 26

జియో సినిమా

  •  థగ్స్‌ -తెలుగు/తమిళ్‌/హిందీ 
  •  క్రాక్‌ డౌన్‌ -వెబ్‌సిరీస్-సీజన్‌2 
  •  చిత్రకూట్‌ -హిందీ) మే 27

జీ5

  •   సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై- ఒరిజినల్‌ మూవీ- మే 23
  •     విడుదల: పార్ట్‌-1 -తెలుగు 

డిస్నీ+హాట్‌స్టార్‌

  •     అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌- వెబ్‌సిరీస్‌- మే 24
  •     సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ -వెబ్‌సిరీస్‌ -3- మే 26

ఆహా

    గీతా సుబ్రహ్మణ్యం- తెలుగు సిరీస్‌-3 - మే 23

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement