Thodelu Movie
-
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
మీరు ఓటీటీ సినీ ప్రియులా? సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోనే చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ వారంలో పలు చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈవేసవిలో మీకు ఆనందాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న పలు ఆసక్తికర సినిమాలు, వెబ్సిరీస్లేవో ఓ లుక్కేయండి. హారర్ మూవీ 'బూ' విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మోనికా, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ 'బూ'. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈనెల 27 నుంచి జియో సినిమాలోస్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ఏమయ్యాయి? పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా మెప్పించిన నటుడు జగదీష్ ప్రతాప్ భండారి. జగదీశ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ఈ సినిమా ఈ నెల 26న నేరుగా ఆహాలో విడుదల కానుంది. కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ సల్మాన్‌ఖాన్, పూజా హెగ్డే జంటగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎట్టకేలకు వస్తున్న తోడేలు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ భేడియా. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. సిటాడెల్ ఫైనల్ ఎపిసోడ్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో రిచర్డ్ మ్యాడన్, జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరిసీ చివరి ఎపిసోడ్ మే 26 స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ విక్టిమ్/సస్పెక్ట్- (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది. మదర్స్ డే -(హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యూబర్- (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. దసరా -(హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. ఆపరేషన్ మేఫెయిర్- (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. బీడ్ (హిందీ) -స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడ్ అండ్ గోల్డ్ -(జర్మన్) మే 26 టిన్ అండ్ టీనా- (స్పానిష్) మే 26 టర్న్ ఆఫ్ ది టైడ్ -(పోర్చుగీస్) నెట్‌ఫ్లిక్స్ సిరీస్-1 మే26 చోటా భీమ్- (హిందీ) సిరీస్-18 మే 26 బ్లడ్ అండ్ గోల్డ్- (హాలీవుడ్) మే 26 అమెజాన్ ప్రైమ్ మిస్సింగ్- ఒరిజినల్ మూవీ ‘పంచువమ్ అద్భుత విళక్కుమ్-మలయాళం/తెలుగు-మే 26 జియో సినిమా థగ్స్ -తెలుగు/తమిళ్/హిందీ క్రాక్ డౌన్ -వెబ్‌సిరీస్-సీజన్2 చిత్రకూట్ -హిందీ) మే 27 జీ5 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై- ఒరిజినల్ మూవీ- మే 23 విడుదల: పార్ట్-1 -తెలుగు డిస్నీ+హాట్‌స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్- వెబ్‌సిరీస్- మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ -వెబ్‌సిరీస్ -3- మే 26 ఆహా గీతా సుబ్రహ్మణ్యం- తెలుగు సిరీస్-3 - మే 23 -
ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. (ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’) అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది. (ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్) కథేంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్‌కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
Thodelu Review: ‘తోడేలు’ మూవీ రివ్యూ
టైటిల్: తోడేలు నటీనటులు: వరుణ్ ధావన్, కృతిసనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరబ్ శుక్లా తదితరులు నిర్మాత: దినేష్ విజన్ దర్శకుడు: అమర్ కౌశిక్ సంగీతం: సచిన్ జిగార్ సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జి ఎడిటర్: సంయుక్త కాజా విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేటంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్‌కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించిన దుష్ట శక్తులను జంతువుల రూపంలో దేవుడు అడ్డుకుంటాడనేది చాలా సినిమాల్లో చూశాం. తోడేలు సినిమా లైన్ కూడా అదే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కథను విస్తరించిన తీరు బాగుంది. అయితే ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం మైనస్. క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా మలిచాడు. సీరియస్ అంశాలను కూడా బోర్ కొట్టించకుండా కామెడీ వేలో చూపించారు. విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగున్నాయి. అరుణాచల్ అడవి అందాలు, తోడేలు విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం వరుణ్ ధావన్ అనే చెప్పాలి. తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తోడేలుగా మారుతున్న సమయంలో ఆశ్చర్యపోయేలా అతని నటన ఉంటుంది. ఈ సినిమా కోసం వరుణ్ ధావన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. డాక్టర్ అనైకగా కృతిసనన్ మెప్పించింది. హీరో స్నేహితులుగా దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్ చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సచిన్ జిగార్ సంగీతం బాగుంది. తంకేశ్వరి పాట ఆకట్టుకుంటుంది. జిష్ణు కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది. అరుణాల్ ప్రదేశ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే ..!
కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే అదే ఊపులో ఈవారం కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అల్లరి నరేష్, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. మనిషి తోడేలుగా మారితే... వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'భేదియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో వస్తున్న 'లవ్‌టుడే' తమిళంలో సూపర్ హిట్ మూవీ 'లవ్‌టుడే'. అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో హిట్ టాక్ సాధించింది. నవంబరు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగే ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. యాక్షన్ సినిమా 'రణస్థలి' మాటల రచయిత పరుశురాం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లివే నెట్‌ఫ్లిక్స్ వెన్స్డే (వెబ్‌సిరీస్) నవంబరు 23 ద స్విమ్మర్స్ (హాలీవుడ్) నవంబరు 23 గ్లాస్ ఆనియన్ (హాలీవుడ్) నవంబరు 23 బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్) నవంబరు 23 ద నోయల్ డైరీ (హాలీవుడ్) నవంబరు 25 ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్) నవంబరు 25 పడవేట్టు (మలయాళం) నవంబరు 25 అమెజాన్ ప్రైమ్ గుడ్ నైట్ ఊపీ (మూవీ) నవంబరు 23 జీ5 చుప్ (బాలీవుడ్) నవంబరు 25 డిస్నీ+హాట్‌స్టార్ ప్రిన్స్ (తెలుగు) నవంబరు 25 ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ (హాలీవుడ్) నవంబరు 25 ఆహా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు మూవీ) నవంబరు 25 ఎన్బీకే అన్‌స్టాపబబుల్ (సీజన్-2 ఎపిసోడ్ 4) నవంబరు 25 సోనీ లివ్ గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) నవంబరు 25 మీట్ క్యూట్ (తెలుగు మూవీ) నవంబరు 25 -
హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది: వరుణ్ ధావన్
‘హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా ఉంది. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది’అని బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ అన్నారు. వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం భేదియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ..‘ హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లా ఉంది. ఒక దర్శకుడు కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం. ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం.ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై , హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు. ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను’ అన్నారు. ‘నా కెరియర్ టాలీవుడ్ నుంచే స్టార్ట్ చేశాను. నా మొదటి సినిమాకే మంచి లవ్ ఇచ్చారు. అలానే తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది మరోసారి మీ ప్రేమను అందివ్వండి ’అని కృతి సనన్ అన్నారు. -
మహేశ్ బాబు పాటకు కృతీసనన్ డ్యాన్స్.. వీడియో వైరల్
మహేశ్ బాబు ‘వన్- నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతీ సనన్. ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్’లో తన ప్రతిభ చాటింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కృతీ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘భేదియా’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘తోడేలు’ టీమ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతీసనన్ మహేశ్ బాబు పాటకు స్టెప్పులేసి అలరించింది. మహేశ్ బాబు ‘వన్-నేనొక్కడినే’ చిత్రంలోని ‘హల్లో రాక్‌స్టార్.. ఐ ఎం యువర్ ఏంజెల్..’ పాటకు ఈ బ్యూటీ డ్యాన్స్ చేసింది. సినిమా విడైదలై చాలా రోజులు అయినప్పటికీ.. స్టెప్పులు మర్చిపోకుండా వేయడంతో కృతీపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో తనకు బాగా నచ్చిన హీరో ప్రభాస్ అని, నచ్చిన సినిమా ‘పుష్ప’,‘ఆర్ఆర్ఆర్’అని చెప్పుకొచ్చింది. Every Body says Aww Tuzo Mogh Kortha after watching her dance Performance😍 Gorgeous beauty @kritisanon shakes legs on stage @ #Thodelu Pre-Release Press Meet💖#Thodelu🐺 #Bhediya #varundhawan #Kritisanon #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/zBk8bYDYg5 — Shreyas Media (@shreyasgroup) November 19, 2022 -
‘కాంతార’తరహాలో మరో చిత్రం.. మళ్లీ హిట్ కొట్టేనా!
టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. సినిమాల విషయంలో ఈయన తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. డబ్బింగ్ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేసి భారీ కలెక్షన్స్‌ని రాబడుతూ రికార్డు సృష్టిస్తున్నాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా కలెక్షన్స్ చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి దాదాపుగా ఇప్పుడు 60 కోట్ల వసూళ్లను సాధించింది.ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం. కానీ అల్లు అరవింద్ కంటెంట్‌ని నమ్మి ధైర్యంగా సినిమాను రిలీజ్ చేశాడు. ఇప్పుడు కాంతార తరహాలోనే ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతుంది. వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న ‘భేదియా’ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు సాంగ్స్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. మరోవైపు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే వరుణ్ ధావన్, కృతిసనన్ కూడా నేరుగా హైదరాబాద్ విచ్చేసి ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొననున్నారు. కాంతారతో సూపర్ సక్సెస్ అందుకున్న ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ఇప్పుడు తోడేలు చిత్రంతో కూడా అదే స్థాయి విజయాన్ని సాధించుకుంటుంది అనే పరిణామాలు కనిపిస్తున్నాయి.