వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది.
(ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’)
అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది.
(ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్)
కథేంటంటే..
ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్‌కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్‌ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment