Actor Rakul Preet Singh Opens Up About Love, Relationships And Cheating, Deets Inside - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: ప్రేమలో అదే పెద్ద సమస్య, దాన్ని నేను సహించను

Published Wed, Jun 21 2023 11:51 AM | Last Updated on Wed, Jun 21 2023 12:40 PM

Rakul Preet Singh About Love and Cheating - Sakshi

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హీరోయిన్లలో చాలామంది ఇప్పుడు పెళ్లిపై దృష్టి సారిస్తున్నారు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాత్రం తాను ప్రేమలో ఉన్నానని, తన ప్రియుడితో ప్రేమ జీవితం చాలా అందంగా ఉందని, పెళ్లి ఎప్పుడనేది ఇంకా ఆలోచించలేదని అంటోంది. ఈ బ్యూటీ హిందీ నటుడు, నిర్మాత శక్తి బగ్నాకర్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే కదా! తెలుగులో పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించిన ఈమె తమిళం, హిందీ భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ఒకటి, అర చిత్రాలు మినహా పెద్దగా విజయాలను అందుకోలేకపోయింది.

ప్రేమకు పెద్ద శత్రువు అదే..
ప్రస్తుతం కమల్‌ హాసన్‌ నటిస్తున్న ఇండియన్‌–2 చిత్రం పైనే ఈమె ఆశల్ని పెట్టుకుంది. అయితే హిందీలో మాత్రం తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమలోని సమస్యలను, ప్రేమికులు చేస్తున్న తప్పులపై తనదైన శైలిలో స్పందించింది. ఇంతకీ ఆమె ఏం చెప్పారో చూద్దాం.. ‘ప్రేమకు పెద్ద శత్రువు అబద్దం. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం గురించి దాచేందుకు అబద్ధం చెప్పడం పెద్ద విషయం కాదు. ప్రేమించిన వ్యక్తికి ప్రేమికురాలిగా మారడానికి ముందు ఇద్దరి మధ్య ఉండే స్నేహాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను.

ప్రేమను తప్పుగా వాడుకుంటున్నారు
కారణం ఆ స్నేహంలో ఏదైనా మనసుపెట్టి మాట్లాడుకోవచ్చు అందులో దాచడానికి, అబద్ధాలు చెప్పడానికి తావు ఉండదు. తప్పు చేసినా దాన్ని మరవకుండా మనసు విప్పి చెప్పుకోవచ్చు. మనం మనుషులం.. తప్పులు చేయడం సహజం. అయితే చేసిన తప్పును చెప్పకపోవడమే ప్రేమకు పెద్ద సమస్య. ప్రేమలో ఉన్నవాళ్లు అసత్యాలు చెప్పడాన్ని, ఎమోషనల్‌గా మాట్లాడి మోసం చేయడాన్ని నేను సహించను. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రేమను తప్పుగా వాడుకుంటున్నారు. ఏదేదో ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమించే వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వకుండా తనకు నచ్చిందే చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. అలా కాకుండా మిమ్మల్ని సంతోషపరుస్తూ ఉన్నత స్థాయిలో నిలపడమే నిజమైన ప్రేమ అని నేను భావిస్తున్నాను' అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: ఆదిపురుష్‌ 5 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement