నిజమేంటో తెలుసుకోండి | Rakul Preet Singh quashes reports of refusing to shoot for Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

నిజమేంటో తెలుసుకోండి

Published Sun, Jun 28 2020 3:42 AM | Last Updated on Sun, Jun 28 2020 3:42 AM

Rakul Preet Singh quashes reports of refusing to shoot for Sivakarthikeyan - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

‘‘ఒక వార్త రాసే ముందు మీడియా నిజమేంటో? అబద్ధమేంటో చెక్‌ చేసుకుని రాసే రోజు ఎప్పుడొస్తుందో? కొన్ని హిట్స్‌ (డిజిటల్‌ మీడియాని ఉద్దేశించి కావొచ్చు) కోసం నిరాధారమైన వార్తలు రాయడం సరికాదు. బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని మనం ఎప్పుడు చూస్తామో?’’ అని మండిపడ్డారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ బ్యూటీ ఎందుకింత ఆగ్రహం వ్యక్తం చేశారంటే.. శివకార్తికేయన్‌ సరసన తమిళంలో ‘అయలాన్‌’ అనే సినిమా చేయడానికి రకుల్‌ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ ఆరంభించాలనుకున్నారట.

అయితే కరోనా అనేది పూర్తిగా తగ్గేవరకూ షూటింగ్‌కి హాజరయ్యేది లేదని ఆ చిత్రనిర్మాతను రకుల్‌ ఇబ్బందిపెడుతోందనే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ వార్తకే రకుల్‌ పై విధంగా స్పందించారు. అది మాత్రమే కాదు. ‘‘షూటింగ్‌ ఎప్పుడు ఆరంభమవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అన్నారు రకుల్‌. ఈ వార్తలకు ‘అయలాన్‌’ చిత్రదర్శకుడు రవికుమార్‌ స్పందిస్తూ – ‘‘రకుల్‌ ప్రొఫెషనల్‌ ఆర్టిస్ట్‌. ఆమె గురించి వదంతులు రాయడం దురదృష్టకరం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement