సూపర్‌ ఫామ్‌ | Rakul Preet Singh on board for Sivakarthikeyan's upcoming sci-fi film | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఫామ్‌

Published Thu, Mar 29 2018 1:00 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet Singh on board for Sivakarthikeyan's upcoming sci-fi film - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

వన్‌.. టు.. త్రీ.. ఫోర్‌... అండ్‌ నాటౌట్‌. స్టిల్‌ కౌంటింగ్‌. ఇండస్ట్రీలో ఇలాగే అనుకుంటున్నారు హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సూపర్‌ ఫామ్‌ గురించి. ఎందుకంటే.. ఈ ఏడాది ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాలేదు.. నలుగురు పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్‌ కొట్టేశారు రకుల్‌. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్‌జీకే’ చిత్రంలో రకుల్‌ ఒక కథానాయిక. కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమాలోనూ రకుల్‌ను కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు శివకార్తికేయన్‌ హీరోగా ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో రకుల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు చిత్రబృందం.

కమెడియన్‌ నుంచి హీరోగా మారిన శివకార్తికేయన్‌ పెద్ద హీరో ఏంటి? అనుకోకండి. మెల్లిగా అతను ఫామ్‌లోకొస్తున్నాడు. పైగా ఇది సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కాబట్టి బడ్జెట్‌ ఎక్కువ. ఏఆర్‌ రహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇదొక్కటి చాలు.. ఇది పెద్ద సినిమా అని చెప్పడానికి. ఆల్రెడీ బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక అని బీటౌన్‌ టాక్‌. సినిమాల పరంగా రకుల్‌ స్కోర్‌ తమిళ్‌లో 3, హిందీలో 1. ఇంకా ఈ ఏడాది తెలుగులోనే బోణీ చేయలేదు. ఆ సంగతలా ఉంచితే.. ఈ సూపర్‌ఫామ్‌ హ్యాపీనెస్‌లోనే అభిమానులకు దగ్గరయ్యేందుకు సొంత యాప్‌ను రిలీజ్‌ చేసి, కూల్‌గా దూసుకెళ్తున్నారు రకుల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement