తమిళ సినిమా: భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టాలనే ఆలోచన ఉందని నటుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత శివ కార్తికేయన్ అన్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డాక్టర్. ఈయన తన సొంత సంస్థ అయిన శివ కార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ప్రియాంక మోహన్ నాయకి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 9న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నటుడు శివ కార్తికేయన్ మీడియాతో ముచ్చటిస్తూ డాక్టర్ చిత్రంలో నటించడం నాకు కొత్త అనుభవం. ఇందులో ఆర్మీ డాక్టర్ గా నటించాను. ఏం చేస్తాను? ఎవరిని కాపాడతాను అన్నది చిత్రకథ. ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లోనే యు/ఏ సర్టిఫికెట్ పొందిన తొలి చిత్రం ఇదే. కారణం చిత్ర కథ అలాంటిది. అయితే ఇది సీరియస్ కథా చిత్రం కాదు. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే పాటలు, వినోదభరిత సన్నాహాలు ఉంటాయి.
చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత నేను నటించిన డాన్, అయిలాన్ చిత్రాలు వరుసగా విడుదలవుతాయి. అయిలాన్ చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుంది. కాగా, భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టాలనే ఆలోచన ఉంది అని శివ కార్తికేయన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment